బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 నవంబరు 2019 (11:24 IST)

బాలుడి ముక్కులో జిలేబీ చేప.. ఈత కోసం వెళ్తే..?

బావిలో ఈతకొట్టేందుకు వెళ్లిన బాలుడి ముక్కులో జిలేబీ అనే రకానికి చెందిన చేప పిల్ల దూరింది. దీంతో బాధతో విలవిల్లాడిన ఆ బాలుడికి చికిత్స చేసిన వైద్యులు ఆతడి ముక్కు నుంచి జిలేబీ చేప పిల్లను ప్రాణాలతో వెలికితీశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు పుదుక్కోట్టై జిల్లా అన్నవాసల్‌కు సమీపంలో వున్న మన్నవేలాంపట్టికి చెందిన సెల్వం కుమారుడు అరుణ్ కుమార్. 
 
ఇతడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడు తన స్నేహితులతో కలిసి బావిలో ఈత కోసం వెళ్లాడు. ఆ సమయంలో అతడి ముక్కులో జిలేబి చేప పిల్ల దూరింది. దీంతో బాధతో ఇబ్బంది  పడిన అరుణ్ కుమార్‌ను తోటి స్నేహితులు ఆస్పత్రిలో తరలించారు. అక్కడ బాలుడిని పరిశోధించిన వైద్యులు.. చికిత్స అందించి ఆ బాలుడి ముక్కు నుంచి చేప పిల్లను ప్రాణాలతో వెలికి తీశారు.