సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 7 జనవరి 2020 (14:58 IST)

బీజేపీలో చేరేటప్పుడు డప్పుకొట్టి వెల్లడిస్తాం: మంచు లక్ష్మి

మోడి, అమిత్ షాల వల్లే భారతదేశంలో ఆధార్ కార్డ్ ఇవ్వడం వంటి విప్లవాత్మక మార్పులు వచ్చాయని, భారతదేశానికి వన్నె తెచ్చిన నాయకులు మోడీ, అమిత్ షాలు అని కొనియాడారు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి. మోడీ, అమిత్ షా తీసుకువచ్చిన CAA, NRCలు ఈ రెండూ పదునైన చట్టాలు అనీ, ఇటువంటి చట్టాలు తీసుకువచ్చిన ఈ నాయకులు ఇద్దరూ భారతదేశాన్ని చాలా ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. 
 
నేను అభిమానించే నాయకుల్లో మోడీ, అమిత్ షా ప్రధమంగా ఉంటారని, నేను మొదటి నుంచి బీజేపీ సపోర్టర్‌ని అని అన్నారు. అయితే మరి బీజేపీ కండువా ఎప్పుడు కప్పుకుంటున్నారని ఓ టీవీ విలేకరి ప్రశ్నించగా, ప్రస్తుతం నేను సినిమా రంగంలో చాలా యాక్టివ్‌గా ఉన్నాను. అలాగే యాక్టివ్ ప్రొడ్యూసర్ని కూడా.
 
అంతేకాదు ఓ బిడ్డ తల్లిగా యాక్టివ్ మదర్‌ని కూడా. ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ రాజకీయాలలో చేరినప్పుడు డప్పు కొట్టి మరి వెల్లడిస్తానన్నారు మంచులక్ష్మి. సోమవారం మంచు కుటుంబం ప్రధాని మోడీని కలిసిన విషయం తెలిసిందే.