గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 జూన్ 2021 (16:11 IST)

భారత్‌ను కరోనా వీడిపోవాలంటే.. అది జరగాలి.. నిత్యానంద

భారత్‌ను కరోనా ఎప్పుడు వీడిపోతుందనే దానిపై ఇంకా వైద్యులకే క్లారిటీ లేదు అయితే తనకు తాను దేవుడిలా ఫీలైపోయే... స్వామిని అని చెప్పుకునే వివాదాస్పద స్వామి నిత్యానంద ఈ ప్రశ్నకు ఏ ఆన్సర్ ఇస్తాడన్నది ఆసక్తికరం. అత్యుత్సాహం కొద్దీ ఓ భక్తుడు అడగనే అడిగాడు. 
 
స్వామీ ఇండియాలో కరోనా ఎప్పుడు పోతుంది అని... దానికి వీడియో చాటింగ్‌లో నిత్యానంద చిన్నగా నవ్వి... ఎలా పోతుంది... నేను రాకుండా.... నేను వస్తేనే కరోనా పోతుంది... అన్నాడు. తన శరీరంలో అమ్మా దేవి ప్రవేశించిందన్న నిత్యానంద... తాను ఇండియాలో కాలు పెడితే... కరోనా పోతుందని అన్నాడు. అది విని షాకవ్వడం మిగతా భక్తుల వంతైంది.
 
నిత్యానందపై లైంగిక వేధింపుల ఆరోపణలతోపాటూ... చాలా కేసులు ఉన్నాయి. ఈ వివాదాస్పద స్వామి... ఇండియా నుంచి ఈక్వెడార్ వెళ్లి... అక్కడ కైలాస అనే కింగ్‌డమ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఓ చిన్న దీవిని కొనేసి... దాన్నే స్వయంగా ఓ దేశంగా ప్రకటించాడు.
 
అక్కడో కరెన్సీ కూడా సెట్ చేశాడు. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ రావడంతో... ఇండియా నుంచి ఈక్వెడార్ వెళ్లేందుకు ఆ దేశంలో అనుమతి లేదు. దాంతో... నిత్యానంద కైలాసానికి భక్తులు రావట్లేదు. అందుకే నిత్యానంద వీడియో రూపంలో ఎంట్రీ ఇచ్చాడు.