మంగళవారం, 27 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2025 (12:26 IST)

NRI: చెన్నై హోటల్ బిల్లు చూసి షాకైన ఎన్నారై.. కారణం ఏంటో తెలుసా? (video)

NRI Boy
NRI Boy
న్యూజిలాండ్‌లో పుట్టిపెరిగిన ఓ బాలుడికి చెన్నై రెస్టారెంట్ బిల్లును చూసి షాకయ్యాడు. చెన్నైలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో భోజనం చేశాక, బేరర్ తెచ్చిన బిల్లును చూసి ఎన్ఆర్ఐ బాలుడు ఆశ్చర్యపోయాడు. 
 
ఏడు రకాల ఆహార పదార్థాలు ఆర్డర్ చేస్తే.. బిల్లు రూ.1500లు మాత్రమే కావడం ఆ బాలుడిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇండియాలో రెస్టారెంట్లు చాలా తక్కువ మొత్తం చార్జ్ చేస్తాయని ఆ బాలుడు అంటున్నాడు. 
 
అదే న్యూజిలాండ్‌లో అయితే కేవలం మూడు పదార్థాలు ఆర్డర్ చేసినా సరే 200 డాలర్ల బిల్లు వస్తుందని, ఇక్కడ ఏడు పదార్థాలు ఆర్డర్ చేసినా బిల్లు 30 డాలర్లకు మించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 
 
బిల్లును చూసి కొడుకు ఇచ్చిన షాకింగ్ రియాక్షన్‌ను రికార్డు చేసిన ఆ బాలుడి తల్లి.. ఆ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Deepa (@deepaimsi)