శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: బుధవారం, 27 జనవరి 2021 (15:07 IST)

sasikala ఆరోగ్య పరిస్థితి బాగుందంటున్నారు.. కానీ?

శశికళ ఆరోగ్య పరిస్థితిపైనే ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. విడుదలకు ముందు ఆమె కరోనా బారిన పడటం మాత్రం ఆమె అభిమానులను తీవ్రంగా ఆవేదనకు గురిచేసింది. అయితే ఈరోజు శశికళకు జైలు శిక్ష నుంచి విముక్తి లభించిన తరువాత ఒక హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు ఆసుపత్రి సిబ్బంది. 
 
ఈరోజు మధ్యాహ్నం విక్టోరియా ఆసుపత్రి నుంచి విడుదలైన హెల్త్ బులిటెన్లో శశికళ ఆరోగ్యంగా ఉన్నట్లు బి.పి, ఆక్సిజన్ లెవల్స్ కరెక్టుగానే ఉన్నాయంటూ హెల్త్ బులిటెన్ విడుదలైంది. కానీ కరోనా కారణంగా శశికళ బాగా క్షీణించారని.. చాలా సన్నబడ్డారని తెలుస్తోంది.
ఒకవైపు జైలు జీవితం.. మరోవైపు కరోనాతో ఆమె మానసికంగా ఇబ్బందిపడ్డారట. కానీ ఇప్పుడు విడుదల కావడంతో ఆమె ఆరోగ్యం వేగంగా మెరుపడే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు. పదిరోజుల్లోనే శశికళ సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందంటున్నారు.