శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2019 (11:40 IST)

ఉగ్రమూకలకు ఉ.... పోయించాలంటే 370 రద్దు తప్పనిసరి : అమిత్ షా

కాశ్మీర్‌లో ఉగ్రవాదం పారదోలాలంటే ఆర్టికల్‌ 370 రద్దు తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. కాశ్మీర్‌ యువతకు మంచి భవిష్యత్‌ ఇవ్వాలన్నదే తమ లక్ష్యమన్నారు. జమ్మూకాశ్మీర్‌కు సంబంధించిన రిజర్వేషన్లు, తదితర బిల్లులపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
 
'దీర్ఘకాలం రక్తపాతానికి కారణమైన 370 అధికరణం పరిసమాప్తమైంది. జనసంఘ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీని గుర్తుచేసుకోవాల్సిన క్షణాలివి. 370 అధికరణంపై ఎలాంటి పరిణామాలు వస్తాయో ఆనాడే ఆయన చెప్పారు. కొంతమంది మాత్రం నిజాలు దాచిపెట్టారు. 370 రద్దు చేస్తే ప్రపంచమే మునుగుతుందన్నట్లు' ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సరైన చర్య కాదు. భారత్‌లో కాశ్మీర్ అంతర్భాగం. వేరే దేశం కాదు. ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పతాకం ఉండటానికి. అందుకే ఆర్టికల్ 370ని రద్దు చేసినట్టు అమిత్ షా వివరణ ఇచ్చారు.