మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 నవంబరు 2019 (19:25 IST)

మహా ఉత్కంఠకు తెర : శివసేనకు జై కొట్టిన కాంగ్రెస్

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానం అందుకున్న శివసేన పార్టీకి కాంగ్రెస్ అనూహ్యంగా మద్దతు ఇచ్చింది. 
 
ప్రభుత్వంలో చేరకుండా బయట నుంచి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అంగీకరించారు. కొద్ది సేపటి క్రితం ఆమె కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో భేటీ అయ్యి సేనకు మద్దతుపై లోతుగా చర్చించారు. 
 
చివరకు ప్రభుత్వానికి బయటనుంచి మద్దతివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు సోనియా గాంధీ పేరుతో అధికారిక లేఖను విడుదల చేశారు.
 
మరోవైపు, శివసేన ఇప్పటికే ఎన్‌సీపీ మద్దతు ఇచ్చింది. తాజాగా కాంగ్రెస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఈ మూడు పార్టీల సంఖ్యా బలం మ్యాజిక్ నెంబర్‌ను దాటుతుండటంతో శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.