మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (21:48 IST)

కాన్పూర్‌లో స్మాల్ స్పైడర్ మాన్, నిట్టనిలువు గోడలపై బల్లిలా పాకేస్తున్నాడు

ఇప్పటివరకు, మీరు టీవీలో స్పైడర్ మ్యాన్‌ని చూసి వుంటారు. పుస్తకాల్లో స్పైడర్ మాన్ కథలను చదువుకుని వుంటారు, కాని ఈ రోజు మీరు చూడబోయేది నిజంగా స్పైడర్ మ్యాన్‌నే. కళ్లు మూసి తెరిచేలోగా 8 నుండి 10 అడుగుల గోడ ఎక్కేస్తాడతడు. ఈ ప్రత్యేకమైన కళతో, పాఠశాల మరియు చుట్టుపక్కల ప్రజలు అతడిని కాన్పూర్ స్మాల్ స్పైడర్ మాన్ అని పిలుస్తున్నారు.
 
ఇంతకీ కాన్పూర్ స్మాల్ స్పైడర్ మాన్ ఎవరో తెలుసుకోవాలని వుందా? కాన్పూర్ లోని గోవింద్ నగర్ లోని దాదా నగర్ కాలనీలో నివసిస్తున్న శైలేంద్ర సింగ్ తన భార్య గారిమా, ఇద్దరు కుమారులు కలిసి నివసిస్తున్నారు. వీరి కొడుకుల్లో చిన్నవాడికి 8 సంవత్సరాలు. అతను 3వ తరగతి చదువుతున్నాడు. ఇతడికి స్పైడర్ మాన్ అంటే మహా పిచ్చి.
 
అంతే స్పైడర్ మాన్ స్ఫూర్తితో గోడలు ఎక్కడం మొదలుపెట్టాడు. అలా 10 అడుగుల గోడను వేగంగా పైకి ఎక్కడం, దిగడం చాలా సుళువుగా మారిపోయింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియకుండా చేస్తుండేవాడు. ఐతే ఓరోజు విషయాన్ని బాలుడి అన్నయ్య తల్లికి తెలిపాడు. దాంతో తల్లి అతడిని మందలించి గోడపైకి పాకడాన్ని భర్త దృష్టికి తీసుకుని వెళ్లింది.
తండ్రి కూడా బాలుడిని మందలించి ఇకపై గోడలు ఎక్కవద్దని మందలించాడు. కానీ ఈ స్పైడర్ మ్యాన్ మాత్రం గోడలు ఎక్కడం మానడంలేదు. తన సోదరుడి సహాయంతో అతను గోడపైకి ఎక్కే వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసాడు. దీనిని నెల రోజుల్లో 5,40,000 మంది చూశారు. లక్ష వెయ్యి లైక్‌లు వచ్చాయి. హౌస్‌మేట్స్ దీనిని చూసి షాక్ అయ్యారు. నెమ్మదిగా అతని వీడియో కాన్పూర్ నగరం మొత్తం ప్రసిద్ధి చెందింది.
 
ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు పిల్లలు అతనిని కాన్పూర్ యొక్క చిన్న స్పైడర్ మాన్ అని పిలవడం ప్రారంభించారు. పాఠశాలలో పిల్లలు, ఉపాధ్యాయులు స్మాల్ స్పైడర్ మాన్ అని నన్ను పిలిచినప్పుడు నేను సంతోషిస్తుంటాను. కాని నేను ఐపిఎస్ అధికారిగా ఎదగాలని కోరుకుంటున్నాను.