1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జులై 2023 (19:54 IST)

నడిరోడ్డుపైనే పాము ప్రసవించింది.. వీడియో వైరల్

Snake
Snake
నడిరోడ్డుపైనే పాము ప్రసవించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోను కూడా 2.74 కోట్ల మంది వీక్షించగా, 1 లక్షా 25 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోలో పాము పిల్లలు పెడుతుండగా కనిపించిన ఈ దృశ్యానికి నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.  
 
వాస్తవానికి కొన్ని జాతుల పాములు గుడ్లు పెట్టవు.. కానీ పిల్లలకు జన్మనిస్తాయి. పాము పిల్లలకు జన్మనివ్వడం.. అదీ కూడా రోడ్డుపైనే ఇలా ప్రసవించడం చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.