1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (22:17 IST)

తమిళనాడులో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు.. కాంటాక్ట్ అయిన మరో ఏడుగురికి...

తమిళనాడు రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. నైజీరియా నుంచి చెన్నైకు వచ్చిన వ్యక్తికి ఈ వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఎం. సుబ్రహ్మణ్యం బుధవారం రాత్రి ప్రకటించారు. అలాగే, ఆయన్ను కాంటాక్ట్ అయిన్ మరో ఏడుగురికి కూడా ఈ వైరస్ సోకివుండొచ్చన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. మన దేశంలో తొలి ఒమిక్రాన్ కేసు బెంగుళూరులో వెలుగు చూసింది. ఆ తర్వాత మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో వెలుగు చూశాయి. బుధవారం వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోనూ ఈ వైరస్ వెలుగు చూసింది. హైదరాబాద్ నుంచి బెంగాల్‌కు వెళ్లిన ఏడేళ్ళ బాలుడికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఈ నేపథ్యంలో తమిళనాడులో ఒమిక్రాన్ కేసు నమోదైంది. నైజీరియా నుంచి చెన్నైకు వచ్చిన ఓ రాష్ట్ర పౌరుడికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని మంత్రి సుబ్రహ్మణ్యం తెలిపారు. అలాగే, ఆయన్ను కాంటాక్ట్ అయిన మరో ఏడుగురికి కూడా ఈ వైరస్ సోకివుంటన్న అనుమానం కలుగుతుందన్నారు. వారి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్టు ఆయన వెల్లడించారు.