శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (12:54 IST)

60 కోడిగుడ్లతో ఒకేసారి ఓ భారీ ఆమ్లెట్.. వీడియో వైరల్

Omlett
60 కోడిగుడ్లతో ఒకేసారి ఓ భారీ ఆమ్లెట్ వేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దాన్ని కోటి 81 లక్షల మందికి పైగా చూడగా, లక్షా 98వేలకుపైగా లైక్స్ వచ్చాయి. ఈ భారీ ఆమ్లెట్‌ను ముక్కలు చేసి విడివిడిగా ప్యాక్ చేశాడు. 
 
మరి ఒక్కో ప్యాకెట్ ధర ఎంతంటే? రూ.120. ఈ 16 నిమిషాల వీడియోను యూట్యూబర్ యమ్మీ బాయ్ పోస్ట్ చేశారు. రెండు ట్రేలలో ఉన్న 60 గుడ్లను పగలగొట్టి ఓ పెద్ద గిన్నెలో వేసి ఉప్పు వేసి కలపడాన్ని వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ చెఫ్.. ఉల్లిపాయలు, ఉల్లి ఆకులు, క్యారెట్, మాంసం అన్నీ కట్ చేసి... మొత్తం కలిపేశాడు.
 
ఆ తర్వాత ఓ భారీ ప్యాన్‌లో నూనె వేసి.. వేడయ్యాక ఎగ్ మిశ్రమాన్ని వేశాడు. సగం సగం వేస్తూ మిగతా సగం మళ్లీ వేస్తూ అలా మొత్తం ఆమ్లెట్‌ను ఒకేసారి వండాడు. వండిన ఆమ్లెట్‌ను మడత పెట్టి రోల్ లాగా చేశాడు. దాన్ని చిన్న స్లైసెస్‌గా నీట్‌గా కట్ చేశాడు. అందులో లేయర్లు చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రతీ స్లైస్‌నీ ప్యాక్ చేసి విండో షెల్ఫ్‌లో ఉంచుతున్నాడు. అంతే... కస్టమర్లు దాన్ని కొనుక్కొని తినయడమే.
 
ఇలాంటి ఆమ్లెట్ మీకూ తినాలనిపిస్తే... ఈ షాపు ఎక్కడుందో... వీడియో కింద గూగుల్ మ్యాప్స్ లింక్ షేర్ చేశారు యూట్యూబర్. ఇది కొరియాలోని ప్యాంగ్ టేక్ తాంగ్ బోక్ మార్కెట్‌లో ఉంది. నెటిజన్లు ఈ వీడయో చూసి... ఆమ్లెట్ తయారీని మెచ్చుకుంటున్నారు.