కారు దిగుతున్నావా దిగు.. నీ దుస్తులను చించేస్తా? ఉబెర్ డ్రైవర్
బెంగళూరులో ఓ టెక్కీకి ఉబెర్ డ్రైవర్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. రాత్రిపూట పని ముగించుకుని అవుటింగ్ వెళ్లి.. క్యాబ్‌లో ఎక్కి కూర్చున్న మహిళకు ఉబెర్ కారు డ్రైవర్‌తో ఇబ్బందులు తప్పలేదు.
వీకెండ్ కావడంతో శనివారం రాత్రి 11 గంటలకు ఉబెర్ క్యాబ్ బుక్ చేసింది ఓ యువతి. అలా బుక్ చేసిన కారెక్కి కూర్చున్న తనకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడిందనే విషయాన్ని సదరు యువతి తన ఫేస్‌బుక్ పేజీలో రాసింది.
అర్థరాత్రి పూట స్నేహితులతో కలిసి అవుటింగ్ వెళ్లి రాకండి అంటూ ఆ యువతిని హెచ్చరించాడు. ఫోనులోనూ సదరు యువతి గురించి తప్పుగా మాట్లాడాడు. దీన్ని విన్న యువతి డ్రైవర్‌ను మందలించింది.
కానీ ఆ డ్రైవర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. యువతిని నానా మాటలు అన్నాడు. తాను తాగి రాలేదని చెప్పినా యువతిని తూలనాడాడు. ఇక వేరే గతి లేకుండా ఎమెర్జెన్సీ బటన్ నొక్కింది. దాంతో డ్రైవర్‌కు ఫోన్ వచ్చింది.
ఫోనులో మాట్లాడిన యువతి తనకు వేరొక క్యాబ్ పంపాల్సిందిగా కోరింది. దీంతో ఆ డ్రైవర్ నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను దించేశాడు. ''కారు దిగుతున్నావా దిగు.. నీ దుస్తులను చించేస్తా" అంటూ తీవ్రపదజాలంతో దూషించి యువతిని అక్కడే వదిలిపెట్టి వెళ్లాడు. అలా ఆ కారు దిగిన యువతికి మరో క్యాబ్ రాలేదు. చివరికి అర్థరాత్రి పూట స్నేహితుల సాయంతో ఆ యువతి ఇంటికి చేరుకుంది.