శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (15:28 IST)

సీఎం బొమ్మైను ముద్దులతో ముంచెత్తిన మహిళ... వీడియో వైరల్

కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను ఓ మహిళ ముద్దుల వర్షంలో తడిపేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముఖ్యమంత్రి బొమ్మై తన ఇంటికి రావడంతో సంతోషంలో మునిగితేలిన ఆమె.. ముఖ్యమంత్రి చేతిపై ముద్దులు పెట్టింది. దీంతో సీఎం కాస్త అసౌకర్యానికి గురయ్యారు.
 
జనసేవక్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి బసవరాజ్ సోమవారం బెంగళూరులోని గుట్టహళ్లి ప్రాంతంలో పర్యటించారు. ఈ క్రమంలో ఓ మహిళ ఇంటి ముందుకు వెళ్లగా.. సీఎంను చూసిన ఆమె సంతోషంలో బొమ్మై కుడిచేతిని పట్టుకుని పదే పదే ముద్దులు పెట్టింది. 
 
మహిళ ప్రవర్తనతో సీఎం ఇబ్బందికి గురయ్యారు. పక్కనే ఉన్న మంత్రి నారాయణ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం సరికాదని ఆమెను వారించే ప్రయత్నం చేశారు. సీఎం చేతిపై మహిళ ఆపకుండా ముద్దులు పెడుతోనే ఉంది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.