శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: సోమవారం, 21 జనవరి 2019 (15:57 IST)

కేసీఆర్ ఆంధ్రలో అడుగుపెడితే ఏపీ రెండు ముక్కలవుతుందా..?

ఏపీ రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. మరో రెండుమూడు నెలల్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో పొత్తులు గురించి చర్చ జరుగుతోంది. ఇదిలావుండగా వైకాపా చీఫ్-తెరాస కేటీఆర్ ఇద్దరూ సమావేశం కావడంపై తెదేపా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడుతోంది. వైఎస్సార్సీపి-తెరాస పొత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది కాదని అంటోంది. 
 
మరికొందరు నాయకులైతే మరో అడుగు ముందుకు వేసి కేసీఆర్ ఆంధ్రలో అడుగుపెడితే ఏపీ రెండు ముక్కలు కావడం ఖాయమంటూ చెప్తున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్ సైతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాలంటూ చెపుతూ వస్తున్నారు. మరి కేసీఆర్-జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఏం జరుగుతుందన్నది వేచి చూడాల్సిందే.