'రిస్తోం కా లైవ్ టెలికాస్ట్' అనేది ప్రతి కుటుంబానికి సంబంధించినది: హిమానీ శివపురి
ప్రముఖ టెలివిజన్, చలనచిత్ర నటి హిమానీ శివపురి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా పూర్వ విద్యార్థి అయినందున స్టేజ్‌తో ఆమెకు బలమైన అనుబంధం ఉంది. జీ థియేటర్ యొక్క టెలిప్లే 'రిస్తోం కా లైవ్ టెలికాస్ట్'లో పని చేయడం, ఆమె తన మూలాలతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి, తనను తాను బలంగా ప్రతిధ్వనించే పాత్రను పోషించడానికి ఆమెకు చక్కటి అవకాశంగా నిలిచించి. చక్కటి ఈ కుటుంబ నాటకం ఇప్పుడు కన్నడ, తెలుగులోకి అనువదించబడినందుకు ఆమె సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. 'రిస్తోం కా లైవ్ టెలికాస్ట్' ప్రతి కుటుంబంతో మరీ ముఖ్యంగా, వారు ఏ ప్రాంతానికి చెందిన వారైనా కనెక్ట్ అవుతుంది. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని థియేటర్ ప్రేమికులు దీనిని అభిమానిస్తారని ఆశిస్తున్నాను అని ఆమె అన్నారు.
స్టేజిపై అనేక శక్తివంతమైన పాత్రలు పోషించిన నటి, ఏప్రిల్ 27న డిష్ టీవీ రంగ్‌మంచ్ యాక్టివ్, డి2హెచ్ రంగ్‌మంచ్ యాక్టివ్, ఎయిర్‌టెల్ స్పాట్‌లైట్‌లలో ప్రదర్శించబడే టెలిప్లేలో కీలకమైన పాత్రను పోషించారు. జనరేషన్ గ్యాప్, మరెన్నో సమస్యలతో పోరాడుతున్న శర్మ కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉన్న సమస్యల ఇతివృత్తంగా ఈ కథ ఉంటుంది. నిరంతరం గొడవపడే శర్మలకు రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం వచ్చినప్పుడు, వారు కెమెరా ముందు కలిసిపోయినట్లు నటిస్తారు. కానీ, తరువాత కాలంలో సంతోషకరమైన కుటుంబంగా నటించడం అంత సులభం కాదని స్పష్టమవుతుంది. ఆ సంఘర్షణ ఈ కథ చూపిస్తుంది.
తన పాత్ర గురించి హిమానీ మాట్లాడుతూ, “నేను దేనికి చలించని తల్లిగా నటించాను. ఈ టెలిప్లే చూస్తున్న స్త్రీలందరూ ఈ పాత్రతో తమను తాము చూసుకుంటారు. కుటుంబ ప్రేమ మాత్రమే క్లిష్ట సమయంలో మనల్ని నిలబెడుతుంది అని ఇది వెల్లడిస్తుంది. సోషల్ మీడియా, యాప్‌లతో కనెక్ట్ అయిన యువతకు మనం మానవ సంబంధాన్ని కోల్పోతున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోమని టెలిప్లే ప్రోత్సహిస్తుంది.." అని అన్నారు.