శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. టీవీ టైమ్
  3. వార్తలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2023 (16:59 IST)

ప్రపంచంలోని అత్యుత్తమ పని ఒక భాషకే పరిమతం కాకూడదు : శ్రియా పిల్గావ్కర్

Shriya Pilgaonkar
Shriya Pilgaonkar
'ఇంటర్నల్ అఫైర్స్'లో నటించిన శ్రియా పిల్గావ్కర్ ఇప్పుడు జీ థియేటర్ టెలిప్లే లో  తెలుగులో ప్రసారం కాబోతుంది. అధార్ ఖురానా దర్శకత్వం వహించిన ఈ టెలిప్లే ఇప్పుడు తెలుగులోకి అనువదించబడింది. ఆంద్రప్రదేశ్, తెలంగాణాలోని ప్రేక్షకుల నడుమ ఈ టెలిప్లే ప్రతిధ్వనిస్తుందని తాను ఎందుకు భావిస్తున్నానో ఆమె వివరిస్తూ,  ప్రేమ, సమకాలీన సంబంధాలు మీ గతంతో సంబంధం వున్నట్లుగా వుండే ఇతివృత్తం. దీనికి సార్వత్రిక ప్రాధాన్యత ఉంటుంది. భారతదేశంలో ఈ ప్లే  మేము ఎక్కడ,  ఎప్పుడు ప్రదర్శించినా ప్రేక్షకుల నుండి మాకు అమితమైన ఆదరణ, ప్రేమ లభించింది, ఇప్పుడు ఇది తెలుగులోకి డబ్ చేయబడినందున, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రేక్షకులు 'ఇంటర్నల్ అఫైర్స్' గురించి ఏమి అనుకుంటున్నారో తెలుసుకోవటానికి ఆసక్తి గా ఎదురుచూస్తున్నాను... " అని అన్నారు.  ఇది తెలుగులో ఎయిర్‌టెల్ థియేటర్, డిష్ టీవీ రంగ్‌మంచ్ యాక్టివ్&డి2హెచ్ రంగ్‌మంచ్ యాక్టివ్‌లో ప్రసారం అవుతుంది.
 
శ్రియ మాట్లాడుతూ మరిన్ని నాటకాలు ఇదే విధంగా డబ్ చేయబడాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఆమె మాట్లాడుతూ 'ఇంటర్నల్ అఫైర్స్' అనేక భాషలలో డబ్ చేయబడుతుందని నేను ఆశిస్తున్నాను. ఒక కళాకారిణిగా, నా పని వీలైనంత ఎక్కువ మందికి చేరాలని కోరుకుంటున్నాను." అని అన్నారు.