శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2020
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (12:16 IST)

కొత్త ఐటీ శ్లాబులతో ఎలాంటి నష్టం ఉండదట.. ఎలాగంటే...

ఈనెల ఒకటో తేదీన కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర వార్షిక బడ్జెట్ 2020-21ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆదాయ పన్ను (ఐటీ)కు సంబంధించి మినహాయింపులు, తగ్గింపులు లేకుండా కొత్త శ్లాబులు ప్రకటించారు. ఈ శ్లాబులపై గందరగోళం కొనసాగుతోంది. ఈ గందరగోళానికి తెరదించేందుకు రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే ప్రయత్నించారు. 
 
ఈ కొత్త శ్లాబుల విధానంతో ఎవరికీ నష్టం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. 'ఏ విధానం ప్రయోజనకరం, ఏది కాదని మేము చెప్పడం లేదు. ఆ విషయం ఐటీ చెల్లింపుదారులే నిర్ణయించుకోవాలి. ఇందుకోసం ఎలాంటి ఆంక్షలూ పెట్టం. కొత్త విధానం ఎవరికీ హాని చేయకపోయినా, కొందరికి మాత్రం మేలు చేస్తుంది. ఒక్కరు కూడా ఈ కొత్త విధానంతో నష్టపోరు' అని చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే ఐటీ శ్లాబులను ఎంచుకునే విషయంలో ప్రతి పన్ను చెల్లింపుదారునికి స్వేచ్ఛ ఉందనీ, అందువల్ల ఎలాంటి గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఐటీ చెల్లించే వారిలో 30-40 శాతం మందికి కొత్త విధానం ఎక్కువ ప్రయోజనకం చేకూర్చే అవకాశం ఉందన్నారు. అలా చూసినా అది పెద్ద విషయమేని చెప్పారు. ఎల్‌టీసీ, హెచ్‌ఆర్‌ఏ వంటి సౌకర్యంలేని చిన్న వ్యాపారులు, దుకాణాల యజమానులకు కొత్త శ్లాబుల విధానం మేలు చేస్తుందన్నారు.