1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2022
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (10:11 IST)

మోడీ సర్కారు కాల వ్యవధి రెండేళ్లు.. వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యాగాలు?!

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం కాలపరిమితి మరో రెండేళ్లు మాత్రమే. కానీ, వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. 2024 వరకు ఉండే మోడీ సర్కారు ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తుందని నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
 
పైగా, గత ఎన్నికల ప్రచారంలో యేడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఊకదంపుడు ప్రచారం చేశారు. ఈ కోటి ఉద్యోగాల సంగతి దేవుడుతో పాటు ప్రధాని మోడీకే ఎరుక. కానీ, ఇపుడు కొత్తగా 60 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని నిండు సభలో ప్రకటించారు. 
 
నిజానికి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఎదురుగాలి వీస్తుంది. త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగున్నాయి. ఇందులో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఒకటి. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నకల్లో బీజేపీ ఓడిపోయే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఓటమి తప్పదు. 
 
అలాంటపుడు వచ్చే ఐదేళ్లకు లెక్కగట్టి 60 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రకటించడం నిరుద్యోగుల చెవిలో పువ్వులు పెట్టడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ఎన్నికలు వచ్చినపుడుల్లా ఇలాంటి జిమ్మికులు వల్లించడం భారతీయ జనతా పార్టీ నేతలకు అలవాటుగా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.