సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : శుక్రవారం, 14 డిశెంబరు 2018 (18:49 IST)

నూతన గృహానికి శంకుస్థాపన విషయాలు..?

కొత్తగా ఇంటి నిర్మాణాలు చేసేవారు కొందరు ఏదో ఇల్లు కట్టాలని కడతారు తప్ప.. వాస్తు దిశలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని అసలు తెలుసుకోరు. అలా గృహ నిర్మాణాలు చేయరాదని పండితులు చెప్తున్నారు. కనుక వాస్తు ప్రకారం ఈ చిట్కాలు పాటిస్తే..  ఫలితం ఉంటుంది. 
 
1. గృహారంభం, స్తంభ, ప్రతిష్ట చేయడానికి సోమ, బుధ, గురు, శుక్రవారాలు ఉత్తమం. 
 
2. మాఘం, వైశాఖం, కార్తీక మాసాలు మంచివి. 
 
3. విదియ, తృతీయ, పంచమి, సప్తమి, ఏకాదశి, త్రయోదశి తిధులు మంచివి. 
 
4. రోహిణి, మృగశిర, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, పూర్వార్థం, ఉత్తరాషాడ ఉత్తరార్ధం, ఉత్తరాభాద్ర, ధనిష్ట, శతభిషం, రేవతి నక్షత్రాలు ఉత్తమం. 
 
5. వృషభ, సింహ, వృశ్చిక, కుంభ లగ్నాలు ఉత్తమమైనవి. చర లగ్నాలు మేష, కర్కాటక, తుల, మకరం మధ్యమం. 

6. లగ్నాధిపతి, చతుర్ధాధిపతి, అష్టమధిపతి పరిపూర్ణ బలం గరలవారై ఉండాలి. అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉండరాదు. గృహ యజమానికి అరిష్టదాయకం. 
 
 
7. శంకుస్థాపన లగ్నానికి శుభగ్రహాల బలం ఎంతగా కలిగినప్పటికీ సూర్యుడు- అంగారకుడు, శని తృతీయ- షష్టమ- ఏకాదశ స్థానాలలోగానీ, ఉచ్ఛ-మూల త్రికోణ- స్వక్షేత్రాలలో గాని ఉండాలి. లగ్నానికి 4-8 స్థానాలలో ఏ గ్రహాలు ఉండరాదు. 
 
8. శంకుస్థాపనకు మొదటి ఝాము ప్రశస్తం. రెండు ఝాము- మూడో ఝామున కూడా శంకుస్థాపనం చేయవచ్చు. కానీ, నాల్గవ ఝామున మాత్రం చేయరాదు. ఇల్లు కట్టుకునే ముందుగా శంకుస్థాపన చేయడం వలన దోషాలు చాలావరకు తొలగి శుభ పరిణామాలు జరుగుతాయి.