సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సిహెచ్
Last Modified: ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (19:53 IST)

దక్షిణంలో పల్లం వుంటే ఇంట్లో ఎలాంటి పరిస్థితి వుంటుంది?

గృహం బయట దక్షిణ భాగంలో పల్లం, బావి, గుంటలు, సరస్సులు, కొలనులు ఇతరత్రా భౌగోళిక పరిస్థితులు వుంటే ఈ క్రింది నష్టాలు వాటిల్లే అవకాశం వుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
 
ధన నష్టం జరుగుతుంది. ధనానికి వెంపర్లాడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అయినవారినే అడగాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. అడగకూడదని అనుకున్నా అడగాల్సిన అత్యవసర పరిస్థితి తలెత్తుంది.
 
అనారోగ్యం, ఆరోగ్యం కోసం విపరీతంగా ధనాన్ని వెచ్చించడం, చేస్తున్న వృత్తి, వ్యాపారంలో ఒడిదుడుకులు ఏర్పడటం వంటివి తలెత్తుతాయి. మానసిక అశాంతి కలుగుతుంది. కుటుంబంలో ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా అనుమానాలు తలెత్తుతాయి.
 
ఇంట్లో మహిళలు బాధలు పడాల్సి వస్తుంది. వారి ముఖంపై ఎప్పుడూ దుఃఖం తాండవిస్తుంది. అంతేకాదు.. ఇంట్లో పిల్లలపై ప్రేమ వున్నప్పటికీ వారిపై దాన్ని చూపించలేని పరిస్థితి వుంటుంది. కనుక దక్షిణ భాగంలో పైన పేర్కొన్నట్లు లేకుండా చూసుకోవాలి.