ఏడు రోజులు- ఏడు రంగులు.. అదృష్టం కోసం..
వారానికి ఏడు రోజులు. ఈ ఏడు రోజులకు ఆధిపత్యం వహించే గ్రహాల అనుగుణంగా దుస్తులను ధరించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. వారి సలహాల మేరకు ఏ వారం- ఏ రంగు దుస్తులు ధరించాలో చూద్దాం..
ఏడు రోజులు - ఏడు రంగులు
ఆదివారం- సూర్యాధిపత్యం- ఎరుపు రంగు లేదా బత్తాయి రంగు దుస్తులు ధరించాలి.
సోమవారం - చంద్రుని ఆధిపత్యం- తెలుపు రంగు దుస్తులు ధరించాలి.
మంగళవారం- కుజుని ఆధిపత్యం - ఎరుపు రంగు లేదా పసుపు రంగు దుస్తులు ధరించాలి.
బుధవారం - బుధగ్రహాధిపత్యం - పచ్చ రంగు దుస్తులు ధరించాలి.
గురువారం - బృహస్పతి ఆధిపత్యం- పసుపు రంగు దుస్తులు ధరించాలి.
శుక్రవారం - శుక్రుని ఆధిపత్యం- లేత గులాబీ రంగు దుస్తులు ధరించాలి.
శనివారం - శనీశ్వర ఆధిపత్యం - నలుపు లేదా నీలి రంగు దుస్తులు ధరించాలి.
ఆదివారాల్లో ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా సూర్యుని శక్తిని మరింతగా పొందవచ్చు.
సోమవారాల్లో తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా చంద్రుడు సంతృప్తి చెందుతాడు.
ప్రయాణం, వివాహాలు, గర్భం లేదా చర్చల కోసం మంగళవారాలను నివారించాలని జ్యోతిష్యులు చెప్తున్నారు.
బుధుడు బుద్ధి వికాసం, పిల్లల్లో విద్యాబుద్ధిని ఇస్తాడు. అందుచేత ఈ రోజున పచ్చరంగును వాడవచ్చు.
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తే అదృష్టం కలిసివస్తుంది.
సోమవారం లాగానే శుక్రుడు, చంద్రుడు శ్వేతానికి ప్రతీక. అందుకే శుక్రవారాల్లో తెలుపు, లేదా గులాబీ రంగులు అదృష్టాన్నిస్తాయి.
శనివారం నలుపు రంగు దుస్తులు ధరించాలి. ఆ రోజున నీలి రంగును ఎంచుకున్నా.. ప్రకృతితో మమేకమైనా శని సంతృప్తి చెందుతాడు. తద్వారా శనిబాధల నుంచి ఉపశమనం పొందవచ్చు.