బుధవారం, 12 మార్చి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By CVR
Last Updated : మంగళవారం, 20 జనవరి 2015 (18:23 IST)

హెల్తీఫుడ్: వేపాకు వంకాయ కూర..!

కావలసిన వస్తువులు :
లేత వేపాకు - 100 గ్రాములు
వంకాయలు - ఒక కిలో
పసుపు - ఒక స్పూన్
ఆవనూనె - రెండు స్పూన్లు
ఎండు మిరపకాయలు - మూడు
ఉప్పు - తగినంత
 
తయారుచేయండి ఇలా : మొదట వేపాకు చెట్టుపై నుంచి లేత వేపాకును తీసుకుని శుభ్రం చేసి, నూనెలో వేయించాలి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు వంకాయలను ముక్కలుగా చేసి, వాటిని కూడా అదే నూనెలో వేసి వేయించుకుంటూ, అందులోనే పసుపు, ఎండు మిరపకాయలు, ఉప్పు కలిపి సన్న మంట మీద ఉడికించాలి. అలా పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న వేపాకును కూడా ఇందులో కలుపుకోవాలి. అంతే ఆరోగ్యకరమైన వేపాకు వంకాయ కూర రెడి. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే యమా టేస్టీగా ఉంటుంది. 
 
వేపాకులో ఔషధ గణాలు మెండుగా ఉంటాయి. అయినా వేపాకు చేదుగా ఉండడంతో దానిని తినేందుకు ఇష్టపడరు. అయితే ఈ విధంగా చేసుకుంటే రుచిగా ఉంటుంది. జ్వరం, దగ్గు, జలుబు, అమ్మవారు వంటి అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు ఈ వంట చేసుకుని తింటే మంచిది. ట్రై చేసి చూడండి.