మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By CVR
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2014 (17:01 IST)

పసందైన పొటాటో బాల్స్

కావలసిన పదార్థాలు :
బంగాళ దుంపలు (మీడియం సైజ్) - 3,
క్యారెట్, బీన్స్, క్యాబేజీ తురుము - 1 కప్పు,
గుడ్డు - 1,
సన్న సేమ్యా - అరకప్పు,
నూనె - వేయించడానికి సరిపడా,
ఉప్పు - తగినంత,
 
పొటాటో బాల్స్ తయారు చేయండి ఇలా: 
క్యారెట్, బీన్స్, క్యాబేజీ తరుములో ఉప్పు కలిపి పెట్టుకోవాలి. బంగాళదుంపలను ఉడికించి ముద్దగా చేసుకుని అందులో ఉప్పు కలుపుకోవాలి. గుడ్డుసొన గిలకొట్టుకుని ఒక బౌల్‌లో ఉంచుకోవాలి. అలాగే సన్న సేమ్యాను ఒక ప్లేట్‌లో ఉంచుకోవాలి. 
 
ఇప్పుడు అరచేతికి నూనె రాసుకుని నిమ్మకాయంత బంగాళదుంప ముద్దను తీసుకుని పరుచుకోవాలి. అందులో పైన చెప్పిన కూరగాయల తురుమును ఉంచి మూసివేసి బాల్స్‌లా చేసుకోవాలి. వాటిని గుడ్డుసొనలో దొర్లించి, తరువాత సేమ్యాలో కూడా దొర్లించి నూనెలో వేయించుకోవాలి. బంగారు రంగులో వచ్చేంత వరకు వేగించాలి. 
 
అంతే మంచి పోషకాలతో కూడిన బంగాళ దుంపల బాల్స్ రెడీ. రుచిగా ఉండే ఈ బంగాళ దుంపల బాల్స్‌ను టమోటా సాస్‌తో కలిపి తింటుంటే మజాగా ఉంటుంది.