వినాయక చవితి స్పెషల్: మోదకాలు ఎలా చేయాలంటే?
వినాయకుడికి ప్రీతిపాత్రమైన మోదకాలను ఎలా తయారు చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు:
బియ్యం పిండి- ఒక కప్పు,
యాలకులు- ఐదు,
నెయ్యి-తగినంత,
డ్రై ఫ్రూట్స్- గుప్పెడు,
ఉప్పు- చిటికెడు,
బెల్లం- ఒక కప్పు,
నీళ్లు- ఒక కప్పు,
కొబ్బరి తురుము-ఒక కప్పు
తయారీ విధానం: ఒక గిన్నెలో కప్పు నీళ్లు పోసి అందులో చిటికెడు ఉప్పు కొద్దిగా నెయ్యి వేయాలి. ఈ నీళ్లు మరిగాక.. ఒక కప్పు బియ్యప్పిండి వేసి చిన్న మంటపై పది నిమిషాల పాటు ఉడకనిచ్చి దానిని మూత పెట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి అందులో కొబ్బరి తురుము, ఒక కప్పు బెల్లం వేసి చిన్న మంటపై బెల్లం కరిగే వరకు వేడి చేయాలి.
చివరిగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి కలిపి దించుకోవాలి. ఇక ముందుగా తయారు చేసి పెట్టుకున్న బియ్యపు పిండిని చేతికి తడి అద్దుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి.ఇక చిన్న చిన్న ఉండలు తీసుకొని అందులో కొబ్బరి తురుము మిశ్రమాన్ని అందులో పెట్టి మోదకాలుగా సిద్ధం చేసుకోవాలి ఇక ఈ మోదకాలను ఇడ్లీ కుక్కర్లో నెయ్యి రాసి అందులో ఇవి పెట్టి స్టీమ్ పై బాగా పది నిమిషాల పాటు ఉడికిస్తే ఎంతో రుచికరమైన మోదకాలు సిద్ధమైనట్లే.