1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వినాయక చవితి
Written By జె
Last Modified: మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (21:24 IST)

హైదరాబాద్ మెట్రో సిటీలో నిమజ్జనం ఇంత ఖాళీనా?

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం అంటే ఏవిధంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఒక పెద్ద పండగే. పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు ర్యాలీగా వెళ్ళడం.. ఆ హడావిడి డప్పులు వాయిద్యాలు ఇలా ఒకటేమిటి. కానీ ప్రస్తుతం అదంతా ఏమీ లేదు. మొత్తం ఖాళీ.
 
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా తక్కువ అడుగుల్లో విగ్రహాలను తయారు చేశారు. ఒక్క ఖైరతాబాద్ వినాయకుడు మాత్రం కాస్త పెద్దదిగా ఏర్పాటు చేశారు. కానీ ఎలాంటి ఆర్భాటం లేకుండా సాదాసీదాగా నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లో పూర్తి చేస్తున్నారు.
 
ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించిన నేపథ్యంలో వినాయక విగ్రహాలను ఉదయం నుంచి ఎలాంటి హడావిడి లేకుండా తీసుకొచ్చి నిమజ్జనం చేసి వెళ్ళిపోతున్నారు. ఈ యేడాది ఇంతే అనుకుంటున్న హైదరాబాద్ నగర వాసులు వచ్చే సంవత్సరం వినాయక చవితికైనా కరోనా నుంచి బయటపడాలని బొజ్జ గణపయ్యను ప్రార్థిస్తున్నారు.