శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2023 (22:08 IST)

మహిళలూ జాగ్రత్త.. పొట్ట పెరిగితే వెన్ను నొప్పి తప్పదు..

Belly Fat
మహిళలకే కాదు.. పురుషులు కూడా పొట్ట పెరగడంతో వెన్నునొప్పి తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రామీణ స్త్రీల కంటే భారతదేశంలోని పట్టణ పురుషులు, స్త్రీలలో పొత్తికడుపు కొవ్వు ఎక్కువగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
 
మధుమేహం, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్ వంటి అనేక వ్యాధులకు పొట్ట పెరగడమే కారణం అవుతోంది. స్త్రీలకు నడుము చుట్టుకొలత 35 అంగుళాలు, పురుషులకు 40 అంగుళాలు ఎక్కువగా ఉంటే పీసీఓడీ, మధుమేహం, అధిక కొవ్వు స్థాయిలు వంటి అనేక సమస్యలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
 
భారతదేశంలో, పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువ కొవ్వును నిల్వతో కూడిన పొట్టను కలిగివున్నట్లు పరిశోధనల్లో తేలింది.
 
భారతదేశంలోని పది మంది మహిళల్లో ఐదుగురికి కొవ్వు నిల్వల కారణంగా పొట్ట చుట్టుకొలత పెరిగిందని ఇటీవలి అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
 
అందుచేత సాధారణంగా పొట్ట పెరగడాన్ని నిర్లక్ష్యంగా వదిలేయకూడదు. ఎందుకంటే పొట్ట పెరిగితే అనారోగ్య సమస్యలు, వ్యాధులే కాకుండా వెన్నునొప్పి రావడం కూడా తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.