శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 16 ఆగస్టు 2023 (23:12 IST)

వెన్ను నొప్పికి విరుగుడు చిట్కాలు, ఏంటవి?

back pain
ప్రస్తుత కాలంలో ఉద్యోగాలు చేసే వారిలో వెన్ను నొప్పి సమస్య అధికంగా ఉంటోంది. గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం, సరైన పద్దతిలో కూర్చోకపోవడం వలన వెన్నునొప్పి అధికంగా వేధిస్తుంది. ఈ నొప్పిని తగ్గించుకునేందుకు కొన్ని పద్ధతులు పాటిస్తే సరిపోతుంది. అవెంటో తెలుసుకుందాము. 
 
ట్యూనా చేపలో అనేక రకాల ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయి. ఇది డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. శరీరంలోని వెన్ను నొప్పి, మంటను తగ్గిస్తుంది. సాల్మాన్ చేపలో ఒమేగా 3 ఉండడం వలన నొప్పి, మంటను తగ్గిస్తాయి. దీనికి కొద్దిగా మిరియాల పొడి కలిపి తీసుకోవడం మంచిది.
 
క్యారెట్లు వెన్ను నొప్పిని తగ్గించడమే కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.
స్వీట్ పోటాటోలు వెన్ను నొప్పిని క్రమంగా తగ్గించడమే కాకుండా ఇతర సమస్యలను తొలగిస్తాయి.
బాదం, జీడిపప్పు ప్రతి రోజూ తీసుకోవడం వలన వెన్ను నొప్పి తగ్గుతుంది. గ్రీన్ టీ తాగితే కూడా వెన్ను నొప్పిని తగ్గించడంలో సహయపడుతుందని పలు అధ్యాయనాల్లో తేలింది.