నెలసరి రావడానికి ముందు వక్షోజాల్లో నొప్పి.. క్యాన్సర్ ముప్పు?
నెలసరి రావడానికి ముందు వక్షోజాల్లో నొప్పి సహజం. కానీ నొప్పికి క్యాన్సర్‌కు లింకు లేదంటున్నారు వైద్యులు. సాధారణంగా కొందరి శరీరతత్వాన్ని బట్టి, హార్మోన్లు పనిచేసే తీరును బట్టి వక్షోజాల్లో గడ్డలు ఏర్పడుత
నెలసరి రావడానికి ముందు వక్షోజాల్లో నొప్పి సహజం. కానీ నొప్పికి క్యాన్సర్‌కు లింకు లేదంటున్నారు వైద్యులు. సాధారణంగా కొందరి శరీరతత్వాన్ని బట్టి, హార్మోన్లు పనిచేసే తీరును బట్టి వక్షోజాల్లో గడ్డలు ఏర్పడుతుంటాయి. వీటిలో 90 శాతం వరకూ క్యాన్సర్ కారకాలు కానివే వుంటాయి. వాటిలో కూడా ఎక్కువగా ఫైబ్రో ఆడినోమా గడ్డలే వుంటాయి. వీటితో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం వుండదు.
ఇవి ఒక్కొక్కరిలో రకరకాల పరిమాణాల్లో వుంటాయి. పీరియడ్స్ వచ్చే వారానికి ముందు వక్షోజాల్లో కొద్దిగా నొప్పి వుంటుంది. వక్షోజాల్లో ఉన్న ఫైబ్రస్ టిష్యూ కొద్దిగా గట్టిపడుతుంది. అది కొద్ది కొద్దిగా పెరగడం వల్ల ఫైబ్రో అడినోమా గడ్డలు ఏర్పడతాయి. ఇవి క్యాన్సర్‌గా మారే అవకాశాలు వుండవు.
ఇవి మెల్లగా, కొద్దిగానే పెరుగుతాయి. కానీ క్యాన్సర్ గడ్డలు మాత్రం.. అతి త్వరగా పెద్దగా పెరుగుతాయని గ్రహించాలి. అవి చుట్టూ పాకుతాయి. అలాగే పీరియడ్స్‌కు ముందు కాకుండా ఎప్పుడూ నొప్పిగా వుంటాయి. అలా వుంటే తప్పకుండా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.