గురువారం, 31 అక్టోబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (15:55 IST)

ముఖంపై అవాంఛిత రోమాలకు చెక్ పెట్టాలంటే..

మహిళలలో హార్మోన్ల లోపాలు, రుగ్మతల వల్ల ముఖంపై అవాంఛిత రోమాలకు కారణమవుతుంది. అవాంఛిత రోమాలను వదిలించుకోవడానికి సులభమైన మార్గాలేంటో చూద్దాం. 
 
పసుపు పొడి, నిమ్మరసం సమాన మొత్తంలో తీసుకుని ముఖానికి అప్లై చేసి 2 గంటల తర్వాత కడిగేయాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ వీలైనంత వరకు మానేయాలి.
 
అలాగే చిక్కుడు, శెనగలు, పచ్చి బఠానీలు, పొట్లకాయలు, సొరకాయలు, పచ్చిమిర్చి, గుమ్మడికాయలు, కరివేపాకు, మునగకాయలు, పొన్నగంటి, బచ్చలికూర, ముల్లంగి, బ్రోకలీ, జొన్న, మొక్కజొన్న, పచ్చి బఠానీలు ఆహారంలో భాగంగా చేసుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
 
పొద్దుతిరుగుడు విత్తనాలు, నువ్వులు, అవిసె గింజలు, వెల్లుల్లి,  డ్రై ఫ్రూట్స్, బార్లీ, కాయధాన్యాలు తీసుకోవడం ద్వారా హార్మోన్ స్థాయిలను పెంచడానికి, అవాంఛిత ముఖ రోమాలను సహజంగా తగ్గించడంలో సహాయపడతాయి.
 
సోయా హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది తక్కువ మొత్తంలో ఈస్ట్రోజెన్‌ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. చివరికి జుట్టు పెరుగుదలను తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.