సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 24 నవంబరు 2016 (12:33 IST)

మహిళలూ.. హాయిగా ఓ పాట పాడుకోండి.. రోగ నిరోధక శక్తిని పెంచుకోండి.

మహిళలూ.. ఎప్పుడూ ఏదోక పని చేస్తూ.. ఒత్తిడికి గురవుతున్నారా? అబ్బో.. విశ్రాంతి తీసుకుంటే ఆ రోజు చేయాల్సిన పనులన్నీ ఆగిపోతాయని భావిస్తున్నారా? అయితే మీకు అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు.. మానసిక నిపుణుల

మహిళలూ.. ఎప్పుడూ ఏదోక పని చేస్తూ.. ఒత్తిడికి గురవుతున్నారా? అబ్బో.. విశ్రాంతి తీసుకుంటే ఆ రోజు చేయాల్సిన పనులన్నీ ఆగిపోతాయని భావిస్తున్నారా? అయితే మీకు అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు.. మానసిక నిపుణులు. అయితే మహిళలు.. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని పనులున్నా.. హాయిగా నవ్వడం, ఓ పాట పాడుకోవడం అనేది ఒత్తిడిని తగ్గించి మూడ్‌ని పెంచుతుంది.
 
అంతేకాదండోయ్ పాడటం వల్ల రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుందని తాజా అధ్యయనం తేల్చింది. హాయిగా నవ్వడం, రోజూ ఓ పాట పాడటం ద్వారా, లేదా వారంలో నాలుగైదు సార్లు పాడినా రోగనిరోధక శక్తి పెరుగుతుందని అధ్యయనకారులు చెప్తున్నారు. 
 
ఇంకా దొరికింది పది నిమిషాలైనా హ్యాపీగా నిద్రపోవాలని.. దీన్నే పవర్‌న్యాప్‌ అంటారు నిపుణులు. ఒత్తిడీ, అలసటా దూరమై, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని జర్మనీకి చెందిన అధ్యయనకారులు చెప్తున్నారు. అంతేగాకుండా తోటపని చేయడం, నీళ్లు పోయడం వంటి చేస్తే ఒత్తిడి మటాష్ అవుతుందట. ఇలా నేల పని చేయడం ద్వారా మట్టిలోని మేలుచేసే సూక్ష్మక్రిములు సృష్టించే వాసన మెదడులో ఆనందాన్నిచ్చే సెరటోనిన్‌ రసాయనాన్ని పెంచుతుందని అధ్యయనకారులు సూచిస్తున్నారు.