సోమవారం, 16 మార్చి 2026
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2016 (08:39 IST)

వేసవిలో అన్నం పాడైపోతుందా.. డోంట్‌వర్రీ.. ఇలా చేయండి!

వేసవి వచ్చిందంటే వేడికి వండిన వంటకాలు త్వరగా పాడైపోతుంటాయి. అందులో ముఖ్యంగా అన్నం త్వరగా చెడిపోతుంది. ఎండ వేడికి చల్లని పానీయాలు తాగితే బాగుంటుందనిపిస్తుంది. ఆ క్రమంలో జ్యూస్ ఎక్కువగా తాగుతుంటాం. దీనివల్ల ఆకలి తగ్గిపోతుంది. వండినవన్నీ వృధాగా పోతాయి.

అలాకాకుండా మిగిలిపోయిన అన్నాన్ని, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు కలిపి మిక్సీలో రుబ్బి వడియాలుగా చేసి ఎండపెట్టుకోవాలి. ఈ వడియాలు సాయంత్రం స్నాక్స్‌గా కానీ రాత్రికి భోజనంలోకి అయినా మంచి రుచికరంగా ఉంటాయి.