గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2017 (16:04 IST)

అలసట ఆవహిస్తుందా... అదేనేమో పరిశోధించుకోండి..

అలసట, నిద్రమత్తు వదలట్లేదా... రోజువారీ పనులు చేసుకోవడమే కష్టంగా మారిపోతుందా..? అయితే థైరాయిడ్ సమస్య ఉందేమో తెలుసుకోండి. థైరాయిడ్‌ సమస్యలు మధ్యవయసు మహిళల్లో ఎక్కువ. పురుషులతో అన్నీ రంగాల్లో పోటీపడే మహ

అలసట, నిద్రమత్తు వదలట్లేదా... రోజువారీ పనులు చేసుకోవడమే కష్టంగా మారిపోతుందా..? అయితే థైరాయిడ్ సమస్య ఉందేమో తెలుసుకోండి. థైరాయిడ్‌ సమస్యలు మధ్యవయసు మహిళల్లో ఎక్కువ. పురుషులతో అన్నీ రంగాల్లో పోటీపడే మహిళలు, ఇంటి పని కార్యాలయాల్లో పనులతో సతమవుతుంటారు. అలాంటి వారికి విశ్రాంతి లేకపోవడం ద్వారా అలసట సరే. కానీ రోజంతా అలసిపోయినట్లు కనిపించినా.. నిద్ర అదే పనిగా ముంచుకొచ్చినా.. థైరాయిడ్ చెకప్ తప్పకుండా  చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇందుకు కారణం రోగనిరోధకశక్తి పొరపాటున థైరాయిడ్‌ మీదే దాడి చేయటం వల్లేనని వైద్యులు చెప్తున్నారు. ఇది జరిగితే థైరాయిడ్‌ గ్రంథి నుంచి హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోవచ్చు. దీంతో తీవ్రమైన అలసటతో పాటు బరువు పెరగటం, జుట్టు ఊడటం వంటి సమస్యలు తప్పవు. దీంతో ఏ పని చేయాలన్నా ఒంట్లో శక్తి లేనట్లు అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.