సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-11-2023 బుధవారం రాశిఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన మీ సంకల్పం...

horoscope
శ్రీ శోభకృత్ నామ సం|| ఆశ్వీయుజ బ|| దశమి ఉ.7.28 పుబ్బ రా.7.20 తె.వ.3.15 ల 5.01. ప.దు. 11.21 ల 12.07.
 
లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన మీ సంకల్పం నెరవేరుతుంది.
 
మేషం :- సంగీత, సాహిత్య, కళా రంగాలపట్ల ఏకాగ్రత వహిస్తారు. తీర్పు చెప్పాలి అనే కోరిక అధికమవుతుంది. ఇప్పటికిప్పుడు తలెత్తిన సమస్యలను పరిష్కరిస్తారు. భార్య, భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వైద్య రంగంలోని వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆడిటర్లకు అనుకున్నంతగా ఏదీ ఉండదు.
 
వృషభం :- స్త్రీలకు మనోభావాలు దెబ్బతినడం వల్ల మానసిక అశాంతికి లోనవుతారు. మీలో భయం, ఆందోళన అధికమవుతాయి. మిత్రులను కలుసుకుంటారు. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. ఎదుటివారు చెప్పె విషయాలకు జాగ్రత్తగా గమనించి ముందుకు సాగండి. మీ సోపానాలు నెరవేరే సమయం ఆసన్నమైనది. 
 
మిథునం :- నిరుద్యోగులకు ఒక అవకాశం తలుపు తడుతుంది. వ్యాపారస్తులకు ఒత్తిడి, ఆందోళన తప్పదు. అనుబంధాలు బలపడతాయి. నవ్వుతూ, తుళ్ళుతూ అందరితో సరదాగా గడపగలుగుతారు. మిమ్మల్ని చూసి అసూయ పడేవారు అధిమవుతున్నారు అని గమనించండి. విద్యార్థులలో నూతన ఉత్తేజం కానరాగలదు.
 
కర్కాటకం :- మిమ్మలి మీరు తక్కువగా అంచనా వేయండం వల్ల ఇబ్బందులకు లోనయ్యే ఆస్కారం ఉంది. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు దినదినాభివృద్ధి కానరాగలదు. ఉద్యోగస్తులకు తోటి వారి వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. జాగ్రత్త వహించండి. మీ మిత్రులకు ఎలాంటి భావంలో ఉంటారో అలాంటి ఫలితాలు కానరాగలవు. విద్యార్థులు శ్రద్ధ వహించడంవల్ల మంచి జ్ఞానంతో పాటు అభివృద్ధి కానరాగలదు.
 
సింహం :- మనసును అదుపు చేసుకోవటం కష్టం. అభ్యాసం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని విద్యార్థులు గ్రహిస్తారు. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఆత్మాభిమానం అధికమవుతుంది. సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. ధనం బాగుగా వెచ్చిస్తారు. కొత్త కొత్త వ్యాపారాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కన్య :- ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ లేకపోయిన పురోభివృద్ధి అంటూ ఏదీ ఉండదు. ప్రముఖులను కలుసుకుంటారు. పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారస్తులకు కలిసిరాగలదు. శాస్త్రజ్ఞులకు, పండితులకు, పౌరహితులకు ఆశాజనకం. వైద్యులు గృహోకపకరణాలను అమర్చుకుంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది.
 
తుల :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాలవారికి మిశ్రమ ఫలితం. విద్యార్థులు కాలం వ్యర్థం చేయకుండా విద్యను అభ్యసించి ధనం సంపాదించాలి అనే కోరిక అధికమవుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రుణం తీర్చాలి అనే మీ ఆలోచన అధికం కాగలదు. వస్తువులపట్ల, వస్త్రములపట్ల, ఆభరణములపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
వృశ్చికం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి అచ్చుతప్పుల వల్ల మాటపడతారు. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. విద్యార్ధినుల మొండితనం అనర్థాలకు దారితీస్తుంది. మీ అతిథి మర్యాదలు ఎదుటివారికి సంతృప్తినిస్తాయి. సోదరీ, సోదరుల మధ్య ఏకీభావం కుదరదు. రిప్రజెంటేటివ్‌లకు నెమ్మదిగా మార్పులు కానవస్తాయి.
 
ధనస్సు :- బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. స్త్రీలు శమాధిక్యత కారణంగా స్వల్ప అస్వస్థతకు గురువుతారు. ఆలయాలను సందర్శిస్తారు. రవాణా రంగాల వారికి ప్రయాణికులతో చికాకులను ఎదుర్కొంటారు. రావలసిన ధనం చేతికందటంతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి.
 
మకరం :- బ్యాంకు వ్యవహారాలలో అధికారులతో మాటపడతారు. ఆత్మీయులు, బంధువుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. ఒక అవసరానికి ఉంచిన ధనం మరొక ఖర్చుకు వినియోగించ వలసివస్తుంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. ఆహార, వ్యవహారాలు, ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం.
 
కుంభం :- ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారాలు లాభదాయకం. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఓర్పు, ఏకాగ్రత ఎంతోముఖ్యం. ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు ఒక వార్త ఎంతో ఆందోళన కలిగిస్తుంది.
 
మీనం :- స్త్రీలు టి.వి కార్యక్రమాలు, కళాత్మక పోటీల్లో రాణిస్తారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. శత్రువులు మిత్రులుగా మారిమీకు సహాయాన్ని అందిస్తారు. ప్రభుత్వ సంస్థలలో పనులు మందకొడిగా సాగుతాయి. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు ఏకాగ్రత, మెళుకువ అవసరం.