సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : మంగళవారం, 21 జూన్ 2022 (15:19 IST)

21-06-2022 మంగళవారం రాశిఫలాలు ... ఆంజనేయస్వామిని తమలపాకులతో...

Makara rashi
మేషం :- కంప్యూటర్, ఇన్వర్టర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి కలిసివచ్చేకాలం. ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయుయత్నం వాయిదా పడటం మంచిది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. ఏ అవకాశం కలిసిరాక నిరుద్యోగులు ఆందోళన చెందుతారు.
 
వృషభం :- ఉత్తరప్రత్యుత్తరాలు ఆశించినంత సంతృప్తికరంగా సాగవు. మత్స్యకోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. స్త్రీల రచనలకు, కళాత్మతకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్లుగానే వాయిదా పడతతాయి.
 
మిథునం :- స్త్రీలకు సంపాదన, ఉద్యోగం పట్ల ఆసక్తి ఏర్పడతాయి. పెద్ద హోదాలో ఉన్న వారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. రుణాలు తీర్చటానికై చేయుయత్నాలు ఫలిస్తాయి. విద్యుత్, ఎ.సి. కూలర్ మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
కర్కాటకం :- బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలరు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి.
 
సింహం :- వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. రిప్రజెంటేటివ్‌లకు, ఏజెంట్లకు, బ్రోకర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. వ్యవహార ఒప్పందాల్లో తొందరపాటు తగదు. ప్రేమికులు అతిగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి.
 
కన్య :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. రవాణా రంగంలోని వారికి చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కోర్టు వ్యవహారాలు విచారణకు వచ్చే సూచనలున్నాయి. మీ అవసరాలకు కావలసిన ధనం సమయానికి ఏదో విధంగా సర్దుబాటు కాగలదు.
 
తుల :- మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. స్త్రీల మాటకు ఆదరణ, సంఘంలో గౌరవం లభిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు మెలకువ అవసరం. ఖర్చులు రాబడికి తగినట్లుగా ఉంటాయి. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం :- దైవ, సేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. భాగస్వామిక సమావేశాల్లో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. రిటైర్లు ఉద్యోగస్తులకు సాదరవీడ్కోలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. మీ అవసరాలకు కావలసిన ధనం అందుతుంది.
 
ధనస్సు :- ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. స్త్రీలతో సంభాషించేటపుడు మెలకువ వహించండి. కీలకమైన వ్యవహారాలు ఇరకాటంలో పడవేస్తాయి. పాత బాకీలు అతికష్టంమ్మీద వసూలవుతాయి. రాబడికి మించిన ఖర్చులు, తప్పనిసరి చెల్లింపులు ఆందోళన కలిగిస్తాయి. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు.
 
మకరం :- కంది, నూనె,మిర్చి వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. రాజకీయ కళా రంగాల వారికి విదేశీ పర్యటనలు అధికమవుతాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులకు సాదర వీడ్కోలు లభిస్తాయి. మీ ఆశయసాధనకు ఉన్నతస్థాయి వ్యక్తులు సహకారం లభిస్తుంది. విద్యార్థులలో నూతన ఉత్సాహం కానవస్తుంది.
 
కుంభం :- వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులే అనుకూలిస్తాయి. ధనసహాయం, హామీల విషయంలో పునరాలోచన అవసరం. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు ముచ్చటిస్తారు. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది.
 
మీనం :- మీ యత్నాలకు ఆటంకాలు తొలగిపోయి పనులు సానుకూలమవుతాయి. మీ బంధువుల పరపతి మీకే విధంగానూ ఉపయోగపడదు. ప్రముఖులను కలుసుకుంటారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వచ్చే సూచనలున్నాయి. మీ అవసరాలకు కావలసిన ధనం సమయానికి ఏదో విధంగా సర్దుబాటు కాగలదు.