మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. నిస్తేజానికి లోనవుతారు. ధనమూలక సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. పనులు ముందుకు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. కుటుంబీకులు సాయం అందిస్తారు. సమస్యలను ధైర్యం ఎదుర్కుంటారు. విలాసాలకు ఖర్చుచేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. ఫోన్ సందేశాలు నమ్మవద్దు. కీలకపత్రాలు అందుతాయి. ముఖ్యులకు స్వాగతం పలుకుతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. రావలసిన ఆదాయంపై దృష్టిపెడతారు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. భేషజాలకు పోవద్దు. వివాదాలు సద్దుమణుగుతాయి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
చర్చలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఖర్చులు విపరీతం. పనులు వేగవంతమవుతాయి. ప్రముఖులకు చేరువవుతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ప్రయాణం కలిసివస్తుంది.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. సహాయం ఆశించవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. దంపతుల మధ్య కలహం. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు అధికం.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అన్ని విధాలా అనుకూలమే. కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు మీ పై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. దుబారా ఖర్చులు అధికం. విదేశీ పర్యటనలకు సన్నాహాలు సాగిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
నిర్దిష్ట ప్రణాళికలతో అడుగులేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. బాకీలు వసూలవుతాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు ముందుకు సాగవు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
గ్రహాల సంచారం బాగుంది. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. మీ సమర్థతపై ఎదుటివారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పనులు స్థిమితంగా పూర్తి చేస్తారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. రావలసిన ధనం అందుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సంకల్పబలమే మీ విజయానికి దోహదపడుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మొండిగా పనులు పూర్తిచేస్తారు. ముఖ్యులకు స్వాగతం, ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అన్నింటా మీదే పైచేయి. మాట నిలబెట్టుకుంటారు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు.