సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

28-03-2023 - మంగళవారం రాశిఫలాలు - శ్రీమహాలక్ష్మీని ఎర్రని పూలతో ఆరాధించి శుభం...

astro3
మేషం :- మీ శ్రమను దుర్వినియోగం చేయకండి. న్యాయవాదులు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తి, ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు.
 
వృషభం :- స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. ఆలయ సందర్శనాలలో ప్రముఖులను కలుసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి పెద్దమొత్తంలో చెక్కులిచ్చే విషయంలో పునరాలోచన మంచిది.
 
మిథునం :- ఉద్యోగస్తులు క్రిందిస్థాయి పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారరంగాల వారికి దస్త్రం ముహూర్తం నిర్ణయిస్తారు. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు.
 
కర్కాటకం :- ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. ప్రియతములు, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కోర్టు తీర్పులు మీకే అనుకూలంగా వచ్చే సూచనలున్నాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి.
 
సింహం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధు, మిత్రుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. ఒక కార్యార్థమై దూర ప్రయాణం చేయవలసివస్తుంది. అవసరానికి రుణాలు సకాలంలో అందవు. వ్యూహాత్మకంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. నిత్యవసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి.
 
కన్య :- వ్యాపారాలకు సంబంధించి ఓ సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. మీ సంతానం చేయు పనులు మీకెంతో చికాకులు కలిగిస్తాయి. వ్యాపారుల ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి. పెద్ద మొత్తం ధనంతో ప్రయాణాలు మంచిది కాదు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
తుల :- దైవ దర్శనాలకై చేయు ప్రయత్నాలు ఫలించగలవు. వాహనం నిదానంగా నడపటం అన్నివిధాల క్షేమదాయకం. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. భాగస్వామిక సమావేశాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
వృశ్చికం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. ప్రత్యర్థుల పట్ల కొంత మెళకువగా ఉండటం మంచిది. తలచిన పనులలో కొంత అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. సమయానికి కావలసిన వస్తువు కనిపించకపోవచ్చు.
 
ధనస్సు :- ఒక శుభకార్యం నిశ్చయం కావటంతో స్త్రీలలో ఉత్సాహం, హడావుడి చోటుచేసుకుంటాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. బీమా ఏజెంట్లకు, స్థలాల బ్రోకర్లకు చికాకులను ఎదుర్కొంటారు.
 
మకరం :- గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలకు దైవ కార్యక్రమాలపట్ల అసక్తి అధికమవుతుంది. మీ అవసరాలు ఇబ్బంది లేకుండా గడుస్తాయి. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను సునాయాసంగా అధికమిస్తారు. అవివాహితులకు శుభవార్తలు అందుతాయి.
 
కుంభం :- ఉద్యోగస్తులు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక తప్పిదం జరిగే ఆస్కారం ఉంది. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. వ్యాపారస్తులు దస్త్రం వ్యవహారంలో క్షణం తీరిక ఉండదు. విలువైన వస్తువులు, ఆభరణాలు అమర్చుకుంటారు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు తప్పవు.
 
మీనం :- కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు మీ పురోభివృద్ధికి దోహదపడతాయి. సోదరీ, సోదరుల మధ్య విబేధాలు తలెత్తుతాయి. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు సదావకాశాలు లభించగలవు. ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగా జరుగుతాయి. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం.