ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

31-05-22 మంగళరం రాశిఫలాలు ... లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన మీ సంకల్పం ...

astro3
మేషం :- దంపతుల మధ్య సఖ్యత లోపం, పట్టింపులు అధికం. ఒక స్థిరాస్తి కొనుగోలు నిమిత్తం కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతారు. స్త్రీలు శుభకార్యాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. బంధువులకు సహకరించి వారికి మరింత సన్నిహితమవుతారు. మీ కార్యక్రమాలు, పనులు అనుకున్నంత సజావుగా సాగవు.
 
వృషభం :- కుటుంబ సమేతంగా ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు చేస్తారు. ఫ్యాన్సీ, మందులు, రసాయినిక సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఐరన్, సిమెంట్, కలప, ఇటుక, ఇసుక రంగాలలోని వారికి కలిసివచ్చేకాలం.
 
మిథునం :- గృహ మరమ్మతులకు అనుకూలం. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనలకు అనుకూలం. దంపతుల మధ్య సఖ్యత లోపం, పట్టింపులు అధికమవుతాయి. ఉద్యోగం చేసే చోట అస్థిరత నెలకొని ఉంటుంది. బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు. స్త్రీల మాటకు ఇంటా బయటా మంచి స్పందన లభిస్తుంది.
 
కర్కాటకం :- స్థిరాస్తి లేక విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంతల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు. రుణాలు, పెట్టుబడులు సకాలంలో అందుతాయి. రాజకీయ, పారిశ్రమిక రంగాల వారికి ఒక ప్రకటన సంతోషం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో అనుకూల ఫలితాలు.
 
సింహం :- ఆలయాలను సందర్శిస్తారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. ఏ విషయమైన పూర్తిగా తెలుసుకోకుండా నిర్ధారణకు రావటం మంచిది కాదు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. చేతి వృత్తి వ్యాపారాలలో మార్పులు కానవస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి.
 
కన్య :- కాంట్రాక్టర్లకు నాణ్యాతాలోప నిర్మాణాల వల్ల కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. చిట్‌ఫండ్, ఫైనాన్సు రంగాల వారికి చికాకులు తప్పవు. వృథా ఖర్చులు అధికమవుతాయి. ఓ చిన్న విహార యాత్రచేస్తారు. కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి పొందుతారు. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
 
తుల :- రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. ఆదాయానికి మించి ఖర్చులు, పెరిగిన ధరలు, కుటుంబ సమస్యలు వేధిస్తాయి. రియల్ ఎస్టేట్, ఏజంట్లకు బ్రోకర్లకు కలసివచ్చేకాలం. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. 
 
వృశ్చికం :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి కలిసివస్తుంది. మీ సంతానం మొండి వైఖరి వల్ల చికాకులను ఎదుర్కుంటారు. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. క్లిష్ట సమయంలో బంధు మిత్రులు జారుకుంటారు.
 
ధనస్సు :- ఆర్ధిక స్థితి కొంత మేరకు మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. వాహన చోదకులకు ఏకాగ్రత అవసరం. దైవదర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. వాయిదా చెల్లింపులకు సంబంధించి ఒత్తిడి ఎదుర్కుంటారు.
 
మకరం :- పత్రికా సిబ్బందికి ఉద్యోగ భద్రత విషయం ఆందోళన కలిగిస్తుంది. అవగాహన లోపం వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. ప్రయాణాల ఆలోచన విరమించుకోవటం శ్రేయస్కరం. ధనం బాగా ఖర్చు చేస్తారు. సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. బంధువులతో సత్సంబంధాలు సన్నగిల్లుతాయి.
 
కుంభం :- ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో మీ శ్రీమతి సలహా పాటించటం మంచిది. స్త్రీలకు వస్త్రప్రాప్తి, వస్తులాభం, శుభకార్యాల్లో ఆదరణ లభిస్తాయి. ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులకు ప్రమోషన్, స్థానచలనం వంటి ఫలితాలున్నాయి. ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహరాల్లో సున్నితంగా మెలగాలి.
 
మీనం :- బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసే విషయాలో జాగ్రత్త వహించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. అర్ధాంతంగా నిలిపివేసిన గృహ మరమ్మతులు, పనులు పునఃప్రారంభిస్తారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.