గురువారం, 25 జులై 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

03-11-2021 బుధవారం దినఫలాలు - గాయిత్రి మాతను ఆరాధించిన శుభం

మేషం :- ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. భాగస్వామిక వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. స్త్రీల మనోవాంఛలు నెరవేరుతాయి. వాహనచోదకులకు ఇబ్బందులు తప్పవు. రావలసిన ధనం అందడంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి.
 
వృషభం :- దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఆస్తి వ్యవహారాల్లో దాయాదుల తీరు ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకిత భావంతో పనిచేయటం క్షేమదాయకం. బంధువుల రాక వల్ల గృహంలో సందడి కానవస్తుంది.
 
మిథునం :- ఆర్థిక విషయాలలో కొంత పురోగతి సాధిస్తారు. కాంట్రాక్టర్లకు పనిమీద ధ్యాస తగ్గటం వల్ల సమస్యలు తప్పవు. సన్నిహితుల సహాయ సహకారం వలన పాత సమస్యలు పరిష్కరించబడతాయి. ఉపాధ్యాయులకు ఊహించని సమస్యలను ఎదుర్కుంటారు. చిట్ ఫండ్, ఫైనాన్స్ రంగాలలో వారికి చికాకు తప్పడు.
 
కర్కాటకం :- కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభం. ఏజెంట్లు, బ్రోకర్లకు సామాన్యం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. సాంఘిక, దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరీ, సోదరుల మధ్య కలహాలు, పట్టింపులు ఎదుర్కొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి.
 
సింహం :- ఉద్యోగస్తులు పెండింగ్ పనులు అతికష్టంమ్మీద పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. స్త్రీలకు అయిన వారి నుంచి అందిన ఒక సమాచారం సందిగ్ధానికి గురిచేస్తుంది. దంపతుల మధ్య విబేధాలు తలెత్తుతాయి. మీ ఆలోచనలు, పథకాలు పలు విధాలుగా ఉంటాయి. ప్రయాణాలు అధికం.
 
కన్య :- కలప, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం. మిత్రుల ద్వారా అందిన సమాచారం మీలో పలు ఆలోచనలు రేకెత్తిస్తుంది. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్య యత్నాలు ముమ్మరం చేస్తారు.
 
తుల :- ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. మీ మౌనంవారికి గుణపాఠమవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో లౌక్యంగా మెలగండి. మీ కార్యక్రమాలు, ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఉన్నతస్థాయి అధికారులు కిందిస్థాయి సిబ్బందితో సంయమనంతో మెలగవలసి ఉంటుంది.
 
వృశ్చికం :- ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. కొత్త బాధ్యతలు బలవంతంగా స్వీకరించాల్సి వస్తుంది. మీ ఆశయ సిద్ధికి బంధువులు సహకరిస్తారు. ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకు అవసరం. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు.
 
ధనస్సు :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళుకువ వహించండి. ప్రియతములతో కలిసి శుభకార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. చేసేపనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
 
మకరం :- కొత్తగా వ్యాపారం చేయాలని ఉంటే వాయిదా వేయకండి. స్త్రీలకు ఆరోగ్యములో చికాకులు తలెత్తవచ్చు మెళుకువ వహించండి. ఆలయాలను సందర్శిస్తారు. బ్యాంకు ఉద్యోగులు విధినిర్వహణలో అలసత్వంతో ప్రమాదంలో పడే సూచనలున్నాయి. జాగ్రత్త వహించండి. కొన్ని సందర్భాల్లో మంచికిపోతే చెడు ఎదురవుతుంది.
 
కుంభం :- ఆర్థిక సంస్థల నుంచి నిధులు మంజూరవుతాయి. స్త్రీలకు దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది. గృహంలో మార్పులు, చేర్పులు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలించవు. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులు కలిగిస్తాయి.
 
మీనం :- ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రుణయత్నాల్లో ప్రతికూలత లెదుర్కుంటారు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.