శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-01-2022 శుక్రవారం దినఫలాలు - కార్తీకేయుడిని పూజించినా మీ మనోవాంఛలు...

మేషం :- అనవసపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు, మార్పులు అనుకూలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు మిశ్రమ ఫలితం. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్‌ల్‌లో జాప్యం వద్దు. 
 
వృషభం :- ఉద్యోగస్తుల శ్రమకు గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలు వాగ్దాటితో అందరినీ ఆకట్టుకుంటారు. రాజకీయనాయకులకు సేవా కార్యక్రమాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.
 
మిథునం :- పోస్టల్, కొరియర్ రంగాల వారికి పని భారం అధికం. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. ఇతరుల మేలు కోరి చేసిన మీ వాక్కు ఫలిస్తుంది. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
 
కర్కాటకం :- వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ మందుల వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వినియోగిస్తారు. ఆడిటర్లకు, అక్కౌంటెంట్లకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ఉద్యోగ ప్రకటనలపై ఏకాగ్రత వహించండి. విద్యార్థులకు తమ ధ్యేయం పట్ల ఆసక్తి, పట్టుదల అధికమవుతాయి.
 
సింహం :- బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. స్థిరాస్తి విక్రయంలో తొందరపాటు తగదు. వృత్తి, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన మార్పులుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. విద్యార్థులు తోటివారి వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.
 
కన్య :- వ్యాపార విస్తరణ, పరిశ్రమల స్థాపనకు యత్నాలు చేస్తారు. మీ ఆగ్రహావేశాల వల్ల వ్యవహారాలు చెడే ఆస్కారం ఉంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం సంభవం. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు.
 
తుల :- చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు రాబడికి మించటం వల్ల స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కోనక తప్పదు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. శత్రువులు మిత్రులుగా మారి సహయం అందిస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయత్నపూర్వకంగా అవకాశాలు కలిసివస్తాయి.
 
వృశ్చికం :- వ్యాపారస్తులు ఊహించని లాభాలను సొంతం చేసుకుంటారు. రవాణా, మెకానిక్ రంగాల్లో వారికి చికాకులు తప్పవు. ధనం మితంగా వ్యయం చేయండి. ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలకు బంధు వర్గాలతో పట్టింపులు అధికమవుతాయి. మీ సంతానం విద్యా, ఆరోగ్య విషయాలపట్ల ప్రత్యేక శ్రద్ధకనబరుస్తారు.
 
ధనస్సు :- మీ సమర్థత, వాక్చాతుర్యం ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు తమ క్లయింట్స్ ధోరణి చికాకు కలిగిస్తుంది. విదేశీయత్నాల్లో ప్రయాసలకు లోనవుతారు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు, సూచనలకు ఆమోదం లభిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి పనివారితో చికాకులు తప్పవు.
 
మకరం :- దైనందిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి అచ్చుతప్పులు దొర్లటం వల్ల చికాకులు తప్పవు. కొత్త వ్యాపారాలు వాయిదా పడుట మంచిది. ప్రేమికుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. ఏ విషయంలోను ఎదుటివారిని అతిగా విశ్వసించటం మంచిది కాదని గమనించండి.
 
కుంభం :- స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. విద్యార్థులకు ప్రతీ విషయంలోను ఏకాగ్రత, కొత్త విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ కృషికి గుర్తింపు, సత్పలితాలుంటాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు, వాతావరణం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
 
మీనం :- ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. ఉద్యోగస్తులు సేవా, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మాటతీరు, పద్దతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ప్రత్యర్థులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మి ధనలాభం, ప్రయోజనకరమైన ఖర్చులేఉంటాయి.