శుక్రవారం, 21 జూన్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ప్రశ్నలు- సమాధానాలు
Written By రామన్

18-09-2023 - సోమవారం దినఫలాలు - పంచామృతాలతో వినాయకుడిని ఆరాధించినా శుభం

Ganapathi
Ganapathi
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద శు॥ తదియ ఉ.10.15 చిత్త ఉ.11.05 సా.వ.4.56 ల 6.36. ప.దు. 12.24 ల 1.13 పు.దు. 2.52 ల 3.41.
 
పంచామృతాలతో వినాయకుడిని ఆరాధించినా శుభం, జయం, పురోభివృద్ధి 
 
మేషం :- చేతివృత్తులు, చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. ప్రైవేటు రంగాల్లో వారు మార్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలించవు. ఎదుటివారితో సంభాషించేటపుడు మెళకువ అవసరం. అప్రయత్నంగా కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
వృషభం :- మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. పెద్ద హోదాలో ఉన్న వారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. ఖర్చులు సామాన్యంగా ఉంటుంది.
 
మిథునం :- మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి, విద్యుత్ లోపం అధికం కావడం వల్ల ఆందోళనకు గురవుతారు. రిప్రజెంటివ్‌లకు నిర్దేశించబడిన గమ్యానికి చేరలేకపోవడంవల్ల ఇబ్బందులకు లోనవుతారు. సంగీత, సాహిత్య అభిలాష పెరుగుతుంది. విదేశీయ వస్తువుల పట్ల ఆసక్తి పెరుతుంది.
 
కర్కాటకం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి ఆశాజనకంగా ఉండగలదు. మీకు పొట్ట, కాళ్ళు, నడుముకు సంబంధించిన చికాకులు అధికం అవుతాయి. వాహనం నడుపునడు మెళుకువ అవసరం. సంతాన ప్రాప్తి, సంతానఅభివృద్ధి శుభదాయకంగా ఉంటుంది. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
 
సింహం :- భాగస్వామ్యుల మధ్య పరస్పర అవగాహన లోపం, చికాకులు వంటివి తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. కాంట్రాక్టుర్లకు చేతిలో పని జారవిడుచుకునే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒక్కోసారి మీ సంతానం మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది.
 
కన్య :- ఏదైనా స్థిరాస్తులు అమ్మకానికై చేయుయత్నాలు వాయిదా పడతాయి. ఆయిల్, నూనె, గ్యాస్ వ్యాపారస్తులకు పనివారితో ఇక్కట్లు తలెత్తగలవు. వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థుల్లో కన్నా, విద్యార్థినులలో పురోభివృద్ధి కానవస్తుంది. సహకార సంఘాల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
తుల :- వ్యాపారులకు పోటీ పెరగటంతో ఆశించింనంత పురోభివృద్ధి కానవస్తుంది. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం :- కుటుంబీకుల మధ్య అభిప్రాయభేదాలు తొలగిపోతాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. విలాసాలకు, ఆడంబరాలకు వ్యయం చేసే విషయంలో ఆలోచన, పొదుపు అవసరం. ఉద్యోగస్తులు యూనియన్ వ్యవహారాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది.
 
ధనస్సు :- దైవ కార్యక్రమాల పట్ల, సాంఘిక కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. సభా సమావేశాలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు సంతృప్తి కానవస్తుంది. సహోద్యోగులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. బంధు మిత్రుల కలయిక మీకెంతో సంతృప్తినిస్తుంది. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థలలో అవకాశాలు లభిస్తాయి.
 
మకరం :- ఆలయాలను సందర్శిస్తారు. విదేశీయానం నిమిత్తం చేస్తున్న యత్నాలలో ఆటంకాలు తొలగిపోతాయి. రుణం ఏ కొంతయినా తీర్చాలనే మీ ఆలోచన వాయిదా పడుతుంది. పోస్టల్, ఎల్.ఐ.సి ఏజెంట్లకు శ్రమాధిక్యత మినహా ఆశించినంత ఫలితాలు ఉండవు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది.
 
కుంభం :- తొందరపాటు నిర్ణయాల వల్ల ఒక్కోసారి మాటపడవలసివస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. స్త్రీలు దైవ, పుణ్య కార్యాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. మీ సంతానం పైచదువుల కోసం బాగా శ్రమించాల్సి ఉంటుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలరు.
 
మీనం :- చిన్నారులకు విలువైన బహుమతులు అందజేస్తారు. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. మీ కుటుంబీకులపట్ల మమకారం అధికమవుతుంది. విద్యార్థులకు విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం.