బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Modified: శనివారం, 7 నవంబరు 2020 (20:34 IST)

08-11-2020 నుంచి 14-11-2020 వరకు మీ వార రాశి ఫలాలు - video

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
వ్యవహారాలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కష్టం ఫలిస్తుంది. మానసికంగా కుదుట పడుతారు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. శుక్ర, శని వారాల్లో ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. రాబడిపై దృష్టి పెడతారు. సంతానం దూకుడు అదుపు చేయండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సన్నిహితులను కలుసుకుంటారు. ఆశించిన పదవులు దక్కక పోవచ్చు. ప్రత్యర్థి వైఖరి ఆందోళన కలిగిస్తుంది. ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తి నీయవు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆది, సోమ వారాల్లో పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయం స్పష్టంగా తెలియజేయండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. దైవ, సేవా కార్యక్రమంలో పాల్గొంటారు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ వారం శుభదాయకం. ఊహలు అంచనాలు ఫలిస్తాయి. కష్టార్జితం దక్కుతుంది. ఖర్చులు అధికం సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు హడావుడిగా సాగుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనివారల నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం విషయాల్లో శుభ పరిణామాలున్నాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికంగా బాగుంటుంది. అవసరాలు నెరవేరుతాయి. సన్నిహితులకు సాయం అందిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులులభ్యమవుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం. అతిగా శ్రమించవద్దు. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. మీ శ్రీమతి వైఖరిలో శుభ పరిణామాలున్నాయి. గృహంలో మార్పుచేర్పులు సత్ఫలితాలిస్తాయి. పత్రాలు అందుకుంటారు. సందేశాలు ప్రకటనలు పట్ల అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి చెల్లింపులు జరపవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత. సమయపాలన ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆచితూచి వ్యవహరించాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఏ విషయీన్ని తేలికగా తీసుకోవద్దు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు అనుకున్న విధంగా సాగవు. మంగళ, బుధ వారాల్లో కొత్త సమస్యలు ఎదురవుతాయి. పదవులు కాంట్రాక్టులు దక్కవు. మీ యత్నాలకు కొంతమంది అడ్డు తగిలే ఆస్కారముంది. కుటుంబ విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. ఆరోగ్య విషయంలో అలక్ష్యం తగదు. ఆప్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. నోటీసులు అందుకుంటారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వైద్య, సేవా సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కన్య: ఉత్తర, 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. గురువారం నాడు పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆప్తుల రాక ఉత్సాహాన్నిస్తుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. నిర్మాణ మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఆశావహ దృక్పథంతో ఉద్యోగ యత్నం సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొన్ని సమస్యల నుంచి బయటపడుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంది. పనులు చురుకుగా సాగుతాయి. గృహం ప్రశాంతగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో తగదు. శుక్ర, శని వారాల్లో ప్రకటనలు, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. అపరిచితులు మోసగించేందుకు యత్నిస్తారు. సన్నిహితుల సలహా పాటించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిన్న వ్యాపారుల ఆదాయం బాగుంటుంది. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడుతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. ఆది, సోమ వారాల్లో చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఆలోచనల్లో మార్పు వస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శుభ కార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. అధికారులకు కొత్త బాధ్యతలు, పందాలు, పోటీలు ఉల్లాసాన్నిస్తాయి.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
సర్వత్రా అనుకూలతలున్నాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. మంగళ, బుధ వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. పోగొట్టుకున్న వస్తువులు అతి కష్టం మీద లభిస్తాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కార్యానుకూలత ఉంది. పెద్దల సలహా పాటిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. పెట్టుబడులపై దృష్టిపెడతారు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గురు,శుక్ర వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. శుభ కార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. బంధువుల వైఖరిలో మార్పు వస్తుంది. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్తవిషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. వేడుకలు వినోదాల్లో పాల్గొంటారు. మీ అలవాట్లు అదుపులో ఉంచుకోండి.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అనుకూలతలున్నాయి. ఒత్తిడిని అధిగమిస్తారు. ఆలోచనలు కొలిక్కి వస్తాయి. ముందుచూపుతో వ్యవహరిస్తారు. అయినవారి ప్రోత్సాహం ఉంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆదాయం సంతృప్తికరం, శనివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పరిచయంలేని వారితో జాగ్రత్త. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. పెద్దల సలహా పాటించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగించండి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. సేవా రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. జూదాల జోలికి పోవద్దు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
దీర్ఘకాలిక సమస్య కొలిక్కి వస్తాయి. సమయోచితంగా నిర్ణయాలు తీసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఆది, సోమ వారాల్లో చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. గృహ మార్పు అనివార్యం. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు క్షేమం కాదు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు అలక్ష్యం తగదు. సహోద్యోగులతో జాగ్రత్త. పోగొట్టుకున్న వస్తువులు లభించే ఆస్కారం లేదు.