ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 మార్చి 2020 (18:15 IST)

సాంబ్రాణితో కరోనాతో మటాష్.. పాలలో వెల్లుల్లిని ఉడికించి?

కరోనాతో ప్రపంచమంతా వణికిపోతున్న తరుణంలో ఆయుర్వేద నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. కరోనాతో భారతీయులు భయపడనక్కర్లేదంటున్నారు. ఆయుర్వేద నిపుణులు పూర్వం చేపట్టిన సలహాలనే మళ్లీ ప్రజలు పాటిస్తే ఇలాంటి కరోనా వైరస్ వంటివి దరిచేరవని అంటున్నారు. ఇలాంటి వాటిలో ముఖ్యంగా సాంబ్రాణి. 
 
ఇంటిని శుభ్రం చేసి సాంబ్రాణిని వేయడం ద్వారా కరోనా వైరస్‌ను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. సాంబ్రాణి ఇంట్లో వేయడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చునని.. ఇంట్లోని వైరస్‌ను తరిమికొట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. సాంబ్రాణిలో వేపాకుతో ధూపం వేయడం ద్వారా కరోనానే కాదు.. ఇతరత్రా వైరస్‌లను దూరం చేయవచ్చు. 
 
అదేవిధంగా ఇంటిముందు పసుపు, పేడను కలిపి ఆ నీటితో అలకడం చేస్తే కరోనా లాంటి వైరస్‌లను తరిమికొట్టవచ్చు. ఇంటికి ప్రధాన ద్వారంలో వేపాకును వుంచడం చేస్తే కరోనాకు వంటి వైరస్‌లు ఇంట్లోకి రానివ్వవు. తులసీ ఆకుల రసాన్ని రోజూ గృహంలోని అందరూ సేవించడం ద్వారా వైరస్ కారకాలతో ఏర్పడే వ్యాధులను దూరం చేయవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 
 
కరోనాను నియంత్రించే ఆహారం..
నలుపు జీలకర్ర, బొప్పాయి, క్యారెట్, అల్లం, వాల్ నట్స్, వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవాలి. పాలలో వెల్లుల్లిని ఉడికించి తీసుకోవడం ద్వారా కరోనాను రానీయకుండా నియంత్రించవచ్చు. ఇంకా వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.