శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : శనివారం, 29 సెప్టెంబరు 2018 (13:38 IST)

కరివేపాకు పొడి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు...

కరివేపాకు లేని కూరలు లేవు. కూర చేసుకునేటప్పుడు కరివేపాకు లేకపోతే పక్కింటి వెళ్లి మరి తెచ్చుకుంటారు. కరివేపాకుకు అంత ప్రధాన్యత ఇచ్చేవారు దానిలో గల ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకుంటే మంచిది.

కరివేపాకు లేని కూరలు లేవు. కూర చేసుకునేటప్పుడు కరివేపాకు లేకపోతే పక్కింటి వెళ్లి మరి తెచ్చుకుంటారు. కరివేపాకుకు అంత ప్రధాన్యత ఇచ్చేవారు దానిలో గల ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకుంటే మంచిది.
 
కరివేపాకును ఎండబెట్టుకుని పొడిచేసి ప్రతిరోజూ వేడివేడి అన్నంలో కలుపుకుని తీసుకుంటే ఆ రుచేవేరు. దీనిలోని ఔషధ గుణాలు రక్తహీనతను తగ్గిస్తాయి. ముఖ్యంగా జీర్ణవ్యవస్థను మెరుగుపరచుటకు చాలా దోహదపడుతుంది. శరీరలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. మీరు చేసుకునే కూరలలోని కరివేపాకును పడేయకుండా తీసుకుంటే జుట్టు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. 
 
కరివేపాకులోని ఐరన్ రక్తప్రసరణ సాఫీగా జరిగే చేస్తుంది. కరివేపాకు పొడిలో కొద్దిగా నూనె కలుపుకుని జుట్టుకు రాసుకుంటే వెంట్రుకలు రాలడం వంటి సమస్యలు తొలగిపోతాయి. కొందరికి జుట్టు ఎర్రగా ఉంటుంది. ఇలా చేస్తే.. జుట్టు నలుపుగా మారుతుంది. అంటే కరివేపాకు పొడిలో పెరుగు, మెంతులు మిశ్రమం కలుపుకుని జుట్టుకు పట్టిస్తే మంచి ఫలితం లభిస్తుంది.