శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 డిశెంబరు 2022 (13:06 IST)

గులాబి రేకులను కందిపప్పుతో కలిపి తీసుకుంటే?

Rose
గులాబి రేకులను కందిపప్పుతో కలిపి తీసుకుంటే శరీరంలోని వేడిని సమతుల్యం చేస్తుంది. శరీరానికి బలాన్ని, శక్తిని ఇస్తుంది. మెదడుకు, కళ్లకు చల్లదనాన్నిస్తుంది. గులాబి కషాయంలో ఆవు పాలు, పంచదార కలిపి తీసుకుంటే పిత్తం వల్ల వచ్చే తలతిరగడం, నోటిలో చేదు, ఛాతి చికాకులు తొలగిపోతాయి. గులాబీ రేకులు, అల్లం, కొబ్బరిని తీసుకుంటే వేడి సంబంధిత వ్యాధులు నయమవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
 
ఉదయం- సాయంత్రం ఒక గుప్పెడు గులాబీ రేకులను నమలడం వల్ల అజీర్ణం-గుండెల్లో మంటలు నయమవుతాయి. నోటి, పేగు పుండును నయం చేస్తుంది. స్త్రీలలో తెల్లబట్ట నయమవుతుంది. 
 
గర్భిణీ స్త్రీలు గులాబీ రేకులను తీసుకోవడం ద్వారా మూత్ర సంబంధిత రుగ్మతలను దూరంచేసుకోవచ్చు. గులాబీ రేకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ కణాల పెరుగుదల మెరుగుపడుతుంది. స్కిన్ గ్లో పెరుగుతుంది, ముడుతలను తగ్గిస్తుంది.
 
గులాబీ రేకులను తాంబూలంతో తింటే నోటి దుర్వాసన పోతుంది. గులాబీ రేకులను మిల్క్ షేక్ చేయడం వల్ల శరీరానికి బలం, చల్లదనం వస్తుంది. గులాబిని బాగా ఎండబెట్టి అందులో తేనె కలుపుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.