శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (17:37 IST)

కాఫీ పొడిలో కొబ్బరి నూనె కలిపి..?

ఈ కాలంలో చాలామందికి ముఖంపై మొటిమలు విపరీతంగా వచ్చేస్తున్నాయి. ఈ మొటిమ సమస్యను తొలగించుకోవడానికి ఏవేవో క్రీమ్స్ వాడుతుంటారు. ఒక్కసారి లేదా రెండుసార్లు అవి బాగా పనిచేస్తాయి. మరి తరువాత సంగతేంటి.. ఎల్లప్పుడూ ఆ క్రీమ్స్ వాడలేం కదా. అందుకు ఇంట్లోని సహజసిద్ధమైన ఈ చిన్న పాటి చిట్కాలు పాటించి చూడండి... తప్పక ఫలితం ఉంటుంది.
 
రెండు బాదం పప్పులను తీసుకుని వాటిని సన్నని మంటపై కాల్చుకోవాలి. ఆపై ఓ చిన్న గిన్నె తీసుకుని అందులో కాల్చిన బాదం పప్పులు వేసి మెత్తని పొడిలా చేసుకుని అందులో స్పూన్ పెరుగు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఆపై ఈ మిశ్రమాన్ని మొటిమలున్న ప్రాంతాల్లో రాసుకుని అరగంట తరువాత నీటితో శుభ్రం కడుక్కోవాలి. ఇలా వారం పాటు క్రమంగా చేస్తే ముఖంపై గల మొటిమలు పోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
 
అలానే కొందరికి చర్మమంతా జిడ్డు జిడ్డుగా పొడిబారినట్టు ఉంటుంది. అలాంటి చర్మాన్ని మృదువుగా చేయాలంటే.. కప్పు కాఫీ పొడిలో 2 స్పూన్ల కొబ్బరి నూనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు, కాళ్లకు రాసుకుని గంటపాటు అలానే ఉంచుకోవాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా తరచు చేస్తే చర్మం మృదువుగా, తాజాగా మారుతుంది.