శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (14:42 IST)

చర్మంపై బ్లాక్ హెడ్స్‌ను తొలగించాలంటే.. ఇలా చేయాలి..?

ముఖం మీద బ్లాక్ హెడ్స్‌తో బాధపడుతున్నట్లయితే... క్లాత్‌ను వేడినీటిలో ముంచి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో కాపడం పెట్టాలి. ఇలా చేసినట్లయితే చర్మం రంధ్రాలు తెరచుకుంటాయి. అప్పుడు నెమ్మదిగా బ్లాక్ హెడ్స్‌ని నొక్కిపట్టి బయటకు తీసివేయాలి. సులభంగా రాకపోతే మళ్లీ కాపడం పెట్టి బయటకు తీయాలి. 
 
అలా మొత్తం బ్లాక్ హెడ్స్‌ను తీసివేసిన తరువాత సహజసిద్ధమైన సబ్బుతో కడిగి, నిమ్మరసంతో ముఖాన్ని తుడుచుకోవాలి. చివరిగా ఐస్‌క్యూబ్స్‌ను బట్టలో పెట్టి వాటితో.. బ్లాక్ హెడ్స్ తీసివేసిన ప్రాంతంలో మర్దన చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేసినట్లయితే.. బ్లాక్ హెడ్స్ సమస్య నుండి క్రమంగా బయటపడవచ్చును.
 
అలానే ముఖంపై ఏర్పడే ట్యాన్ తొలగించాలంటే.. నిమ్మరసం, కీరా రసాలను సమపాళ్లలో తీసుకుని ముఖానికి పట్టించి అరగంట తరువాత చల్లని నీటితో కడిగేస్తే సరిపోతుంది. చేతులపై ఏర్పడే ట్యాన్‌ను తొలగించాలంటే. సన్‌ఫ్లవర్ ఆయిల్, నిమ్మరసం, చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని చేతులకు పట్టించి, కాసేపటి తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే చేతులు మృదువుగా మారుతాయి.