శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (13:39 IST)

మిరియాల పొడి, పెరుగుతో ఫేస్‌ప్యాక్..?

మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యాంగా ఉంచుతాయి. దీనితో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం

నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే అందానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ కాలంలో నిమ్మకాయలు చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి. అయితే వీటిని ఎలా ఉపయోగించాలని తెలుసుకుంటే చాలు.. మెుటిమల కారణం ముఖం అందాన్నే కోల్పోతుంది. నాజూగ్గా ఉండేందుకు ఇలా చిట్కాలు పాటిస్తే సరి..

నిమ్మరసంలో కొద్దిగా తేనె, పెరుగు కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకుంటే మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి. అల్లాన్ని ఎండబెట్టుకుని పొడిచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నీరు, ఆలివ్ నూనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 30 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. 
 
మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యాంగా ఉంచుతాయి. దీనితో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం.. మిరియాల పొడిలో పెరుగు, పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన మెుటిమలు తొలగిపోతాయి.