శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : గురువారం, 27 సెప్టెంబరు 2018 (16:39 IST)

ఆలివ్ నూనె, నిమ్మరసం కలిపి ప్యాక్ వేసుకుంటే..?

కొందరికి చిన్న వయస్సులోనే ముఖం ముడతలుగా మారిపోతుంది. అందుకు రకరకాల క్రీములు, పౌడర్‌లు వాడుతుంటారు. అయిన కూడా ఎటువంటి లాభం లేదని విసుగు చెందుతారు. అందుకు ఇంటి చిట్కాలు పాటిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.

కొందరికి చిన్న వయస్సులోనే ముఖం ముడతలుగా మారిపోతుంది. అందుకు రకరకాల క్రీములు, పౌడర్‌లు వాడుతుంటారు. అయినా కూడా ఎటువంటి లాభం లేదని విసుగు చెందుతారు. దీనికి ఇంటి చిట్కాలు పాటిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. గుడ్డు సొనలో కొద్దిగా తేనె, పెరుగు కలుపుకుని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాతు శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
కీరదోస మిశ్రమంలో కొద్దిగా చక్కెర, బంగాళాదుంప రసం కలుపుకుని కంటి కిందటి నల్లటి వలయాలకు రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ఆ నల్లటి వలయాలు తొలగిపోతాయి. చందనంలో కొద్దిగా పసుపు, రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 
 
20 నిమిషాల పాటు అలానే ఉంచుకుని ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. నిమ్మరసంలో ఆలివ్ నూనె కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం ముడతలు తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది.