ఓట్స్, పెరుగుతో ఫేస్‌ప్యాక్.. నల్లటి వలయాలు..?
శరీర వేడివలన చాలామందికి మెుటిమలు అధికంగా వస్తుంటాయి. ఈ మెుటిమలు కాస్త పగిలి నల్లటి మచ్చలుగా మారుతుంటాయి. దీంతో ముఖం మచ్చమచ్చలుగా ఉంటుంది. అందుకు ఈ చిట్కాలు మంచి ఫలితాలు ఇస్తాయి. అవేంటో తెలుసుకుందాం.
శరీర వేడివలన చాలామందికి మెుటిమలు అధికంగా వస్తుంటాయి. ఈ మెుటిమలు కాస్త పగిలి నల్లటి మచ్చలుగా మారుతుంటాయి. దీంతో ముఖం మచ్చమచ్చలుగా ఉంటుంది. అందుకు ఈ చిట్కాలు మంచి ఫలితాలు ఇస్తాయి. అవేంటో తెలుసుకుందాం.
ఓట్స్ పొడిలో కొద్దిగా తేనె, పెరుగు కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుమూడుసార్లు చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. దాంతో మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి. మరికొందరికి కంటి కింద నల్లనల్లగా ఉంటుంది. ఆ నల్లటి వలయాలు తొలగిపోవాలంటే ఇలా చేయాలి..
తేనెలో కొద్దిగా పెరుగు, నిమ్మరసం, రోజ్ వాటర్ కలుపుకుని కంటి కింద రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన ఆ నల్లటి వలయాలు తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది.