శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 7 ఆగస్టు 2018 (14:46 IST)

గుడ్డు తెల్లసొనను ముఖానికి రాసుకుంటే?

మెుటిమలు రకరకాలుగా చికాకు పెడుతుంటాయి. ఈ మెుటిమలు పగిలిన తరువాత ముఖంపై ఏర్పడే మచ్చలను తొలగించడం మరింత కష్టం. ఇటువంటి సమస్యల నుండి విముక్తిని కలిగించే కొన్ని పద్ధతులను నిపుణులు సూచిస్తున్నారు. మెుటిమల

మెుటిమలు రకరకాలుగా చికాకు పెడుతుంటాయి. ఈ మెుటిమలు పగిలిన తరువాత ముఖంపై ఏర్పడే మచ్చలను తొలగించడం మరింత కష్టం. ఇటువంటి సమస్యల నుండి విముక్తిని కలిగించే కొన్ని పద్ధతులను నిపుణులు సూచిస్తున్నారు. మెుటిమల వలన కలిగే ఎరుపుదనం, వాపులు, ఇన్‌ఫ్లమేషన్ వంటి వాటిని ఐస్ థెరపీ ద్వారా త్వరగా తగ్గించుకోవచ్చును.
 
ఈ థెరపీ వలన రక్తప్రసరణ మెరుగుపడడమే కాకుండా శ్వేద గ్రంథులను గట్టిపరుస్తుంది. దీనితో పాటు చర్మంపై ఉండే దుమ్ము, ధూళి, నూనెలను తొలగించుకోవచ్చును. చిన్న మంచుగడ్డను బట్టలో చుట్టుకుని మెుటిమలు ఉన్న ప్రదేశంలో కొన్ని నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును. 
 
టూత్‌పేస్ట్ దంతాలు మెరిసేందుకే కాదు, మెుటిమలను కూడా తగ్గించుటలో మంచిగా ఉపయోపడుతుంది. ఈ పేస్ట్‌ను మెుటిమలపై రాసుకుని అరగంట తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన మెుటిమల వలన ఏర్పడిన వాపులు తగ్గుతాయి. ప్రోటీన్స్ నిండిన గుడ్డుసొన మెుటిమలను తగ్గింటమే కాకుండా ముఖచర్మంపై ఉండే అవాంఛిత మచ్చలను, వాపులను తొలగిస్తుంది. 
 
3 గుడ్ల నుండి తెల్లసొనను తీసుకుని మూడు నిమిషాల పాటు అలానే ఉంచుకోవాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని ముఖానికి పూతగా వేసుకోవాలి. ఇది ఎండిక తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా రోజులో నాలుసార్లు చేయడం వలన మెుటిమల నుండి ఉపశమనం లభిస్తుంది.